15, జనవరి 2022, శనివారం

ఐతే అది నిజమైతే అదే నిజమైతే పాట లిరిక్స్ - Aithe Adi Nijamaithe Adhe Nijamaithe Song Lyrics in Telugu - Subhalekha (1982) Telugu Songs Lyrics








చిత్రం : శుభలేఖ (1982)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,, పి.సుశీల


 

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

ల ల ల ల ల ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే..

అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే

ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే..

అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే

 

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

 

నింగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి..

దూరభారమెంతైనా రాయబారి నేనున్నా

ఆ.. నింగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి..

దూరభారమెంతైనా రాయబారి నేనున్నా

చందమామ అవునంటే వెన్నెలగా..

కలువ భామ అది వింటే పున్నమిగా

ఆ.ఆఆఆ... ఊహూ..ఊహూ..మ్మ్మ్మ్...

చందమామ అవునంటే వెన్నెలగా..

కలువ భామ అది వింటే పున్నమిగా

నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి 

తలంబ్రాలుగా కురిసే వేళా..చేరువైతే

 

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

ల ల ల ల ల ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

 

లాలలాలా..లాలలాలా..లాల..

రెమ్మ చాటు రాచిలక..కొమ్మ దాటి గోరింక.. 

చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే

రెమ్మ చాటు రాచిలక..కొమ్మ దాటి గోరింక.. 

చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే

ఆకసాన అరుధంతీ నక్షత్రం ..

తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం

ఆ.ఆఆఆ... ఊహూ..ఊహూ..మ్మ్మ్మ్...

ఆకసాన అరుధంతీ నక్షత్రం ..

తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం

మనసిచ్చిన మలిసందెలు కుంకుమలై కురిసీ 

నుదుట తిలకమై మెరిసే వేళా..చేరువైతే..

 

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

లలలలలలలాల నిజమైతే

లలలలలలలాల అదే నిజమైతే..

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి