6, జనవరి 2022, గురువారం

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా పాట లిరిక్స్ - Vallanki Pitta Vallanki Pitta Mellaga Rammanta Song Lyrics in Telugu - Gangotri (2003) Telugu Songs Lyrics







చిత్రం : గంగోత్రి (2003)

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

సాహిత్యం : చంద్రబోస్

గానం : కౌసల్య, ఐశ్వర్య

 


వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట

మెల్లగ రమ్మంటా

చిన్నారి పాపా పొన్నారి పాపా

తోడుండి పొమ్మంటా

తను నవ్విందంటే ఇంకేం కావాలి

నిదరోతూ ఉంటే తన పక్కనుండాలి

ఈ బంగరు పాపను కంటికి రెప్పగ కాచుకోవాలి

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట

మెల్లగ రమ్మంటా

చిన్నారి పాపా పొన్నారి పాపా

తోడుండి పొమ్మంటా

 

గరిసనిసమగరిస గరిసనిసమగరిస

సగమనినిపమగమ సగమనినిపమగమ

పపమగ మమగస గగసనిస 

పపమగ మమగస గగసనిస 

 

చిరు చిరు మాటలు పలికేవేళ చిలక దిష్టి

బుడి బుడి అడుగులు వేసేవేళ హంస దిష్టి

వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి

జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి

ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి

ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి

 

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట

మెల్లగ రమ్మంటా

చిన్నారి పాపా పొన్నారి పాపా

తోడుండి పొమ్మంటా

 

ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మనవుతా

ఆకలేయగా బుల్లి బొజ్జలో బువ్వనవుతా

స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా

ఎక్కెక్కీ ఎడ్చే వేళ కన్నీళ్ళవుతా

నేస్తాన్నవుతా గురువు అవుతా

పనిమనిషి తన మనిషవుతా

నే చెప్పే ప్రతి మాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలీ

 

వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా

మెల్లగ రమ్మంటా

మా మంచి పాట సింహాద్రి పాట

మనసార వినమంటా

తన తియ్యని పాటే అమ్మ పాడే లాలి

తన తోడే ఉంటే అది దీపావళి

మా ఇద్దరి స్నేహం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి

వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా

మెల్లగ రమ్మంటా

మా మంచి పాట సింహాద్రి పాట

మనసార వినమంటా


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి