17, జనవరి 2022, సోమవారం

రాగాలా పల్లకిలో కోయిలమ్మా పాట లిరిక్స్ - Raagala Pallakilo Koyilamma Song Lyrics in Telugu - Subhalekha (1982) Telugu Songs Lyrics










చిత్రం :  శుభలేఖ (1982)

సంగీతం :  కె.వి.మహదేవన్

సాహిత్యం :  వేటూరి సుందరరామమూర్తి

గానం :  యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

 

 

లా... లా... లా....

రాగాలా పల్లకిలో కోయిలమ్మా

రాలేదూ ఈ వేళా ఎందుకమ్మా

 

'నా ఉద్యోగం పోయిందండి..'

'తెలుసు .. అందుకే .. '

 

రాలేదు ఈ వేళా కోయిలమ్మా ..

రాగాలే మూగబోయినందుకమ్మా

 

రాగాలా పల్లకిలో కోయిలమ్మా ..

రాలేదు ఈ వేళా ఎందుకమ్మా

రాలేదు ఈ వేళా కోయిలమ్మా ..

రాగాలే మూగబోయినందుకమ్మా

 

రాగాలా పల్లకిలో కోయిలమ్మా ..

రాలేదు ఈ వేళా ఎందుకమ్మా .. ఎందుకమ్మా 

 

 

పిలిచినా రాగమే .. పలికినా రాగమే కూనలమ్మకీ

మూగ తీగ పలికించే వీణలమ్మకీ

పిలిచినా రాగమే .. పలికినా రాగమే కూనలమ్మకీ

మూగ తీగ పలికించే వీణలమ్మకీ  

 

బహుశా అది తెలుసో ఏమో

బహుశా అది తెలుసో ఏమో జాణ కోయిలా ..

రాలేదు ఈ తోటకీ ఈ వేళా

 

రాగాలా పల్లకిలో కోయిలమ్మా ..

రాలేదు ఈ వేళా అందుకేనా .. అందుకేనా

 

 

 

గుండెలో బాధలే .. గొంతులో పాటలై పలికినప్పుడూ

కంటిపాప జాలికి లాలీ పాడినప్పుడూ

గుండెలో బాధలే .. గొంతులో పాటలై పలికినప్పుడూ

కంటిపాప జాలికి లాలీ పాడినప్పుడూ

 

బహుశా తను ఎందుకనేమో .. ల ల లా ల ల ల ల ల లా లా

బహుశా తను ఎందుకనేమో గడుసు కోయిలా ..

రాలేదు ఈ తోటకీ ఈ వేళా.. 

 

రాగాలా పల్లకిలో కోయిలమ్మా ..

రానేలా నీవుంటే కూనలమ్మా




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి