14, జనవరి 2022, శుక్రవారం

శంకరా నాద శరీరాపరా వేద విహారా హరా జీవేశ్వరా పాట లిరిక్స్ - Sankaraa Naadha Sareerapara Song Lyrics in Telugu - Sankarabharanam (1980) Telugu Songs Lyrics


చిత్రం : శంకరాభరణం (1980)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం 

 


శంకరా... నాద శరీరాపరా

వేద విహారా హరా జీవేశ్వరా 

శంకరా నాద శరీరాపరా

వేద విహారా హరా జీవేశ్వరా 

శంకరా.. ఆఅ...

 

ప్రాణము నీవని గానమె నీదని 

ప్రాణమె గానమనీ

మౌనవిచక్షణ గానవిలక్షణ 

రాగమె యోగమనీ 

ప్రాణము నీవని గానమె నీదని 

ప్రాణమె గానమనీ

మౌనవిచక్షణ గానవిలక్షణ 

రాగమె యోగమనీ 

నాదోపాసన చేసినవాడను 

నీ వాడను నేనైతే

నాదోపాసన చేసినవాడను 

నీ వాడను నేనైతే

దిక్కరీన్ద్ర జిత హిమగిరీన్ద్ర సిత 

కందరా నీలకంధరా

క్షుద్రులెరుగని రుద్రవీణ 

నిర్నిద్రగానమిది అవధరించరా 

విని తరించర 

 

శంకరా నాద శరీరాపరా

వేద విహారా హరా జీవేశ్వరా 

శంకరా.. ఆఅ...

 

మెరిసే మెరుపులు మురిసే పెదవుల 

చిరు చిరు నవ్వులు కాబోలూ

ఉరిమే ఉరుములు సరి సరి నటనల 

సిరి సిరి మువ్వలు కాబోలూ

మెరిసే మెరుపులు మురిసే పెదవుల 

చిరు చిరు నవ్వులు కాబోలూ

ఉరిమే ఉరుములు సరి సరి నటనల 

సిరి సిరి మువ్వలు కాబోలూ

 

పరవశాన శిరశూగంగా

ధరకు జారెనా శివగంగా

పరవశాన శిరశూగంగా

ధరకు జారెనా శివగంగా

నా గానలహరి నువ్ మునుగంగా

ఆనంద వృష్టినే తడవంగా 

ఆఆఆఅ...ఆఆఆఅ...

 

శంకరా నాద శరీరాపరా

వేద విహారా హరా జీవేశ్వరా 

శంకరా.. ఆఅ..

శంకరా.. శంకరా..

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి