చిత్రం : తూటా (2019)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : డర్భూక శివ
గానం : సిద్ శ్రీరామ్
మరువాలి కాలాన్నే మరువాలి లోకాలనే
మౌనంగా తలవాల్చి ఒడిలో నిదురించవే
విరిపాన్పు వోలె పరిచానే హృదయం
పసి పాప నీవై పవళించీ సమయం
గగనాన్నే చేరాలే గతమన్న ఆలోచన
మరునాటి గంధాలే కురవాలి ఈ రోజున
అడుగైన వెయనీనే విధినైన ఈ వీధిన
సుడి నుండి తేల్చాలే నిను నేడు నా లాలన
నడిరేయి కోరల్లో నలిగేటి ఆ రోజులు
విడిచేసి ఆ చీకటిలో విహరించు ఈ వెన్నెలలో
గదిలోంచి విరహాన్ని తరిమేసా రాదే
గడియారం వినిపించే పిడివాదం లేదే
మనలోనే మనం మసలే ఈ క్షణం
జగమే వీడిపోనీ యుగమే గడిచేయనీ
కనుపాపలో నుంచి నువు రాల్చు కావేరిని
కలిపేసుకుంటా కడలై కురిసేను మళ్ళీ కలలై
నువు లేని నిమిషాన్ని వెలివేసా నేడు
నిలువెల్లా నువు నిండే మనసయ్యా చూడు
ఇక నీ చేతిని విడిపోలేనని
ప్రళయం ఎదురైనా మరణం ఎదురైనా
మరువాలి కాలాన్నే మరువాలి లోకాలనే
మౌనంగా తలవాల్చి ఒడిలో నిదురించవే
విరిపాన్పు వోలె పరిచానే హృదయం
పసి పాప నీవై పవళించీ సమయం
గగనాన్నే చేరాలే గతమన్న ఆలోచన
మరునాటి గంధాలే కురవాలి ఈ రోజున
అడుగైన వెయనీనే విధినైన ఈ వీధిన
సుడి నుండి తేల్చాలే నిను నేడు నా లాలన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి