19, జులై 2021, సోమవారం

దూరం కరిగినా… మది మౌనం కరుగునా పాట లిరిక్స్ - Dooram Karigina Madi Mounam Mounam Karugunaa Song Lyrics in Telugu - Jetti (2021) Telugu Songs Lyrics





చిత్రం : జెట్టి (2021)

సంగీతం : కార్తీక్ కొడకండ్ల

సాహిత్యం : శ్రీమణి

గానం : సిద్ శ్రీరామ్



దూరం కరిగినా… మది మౌనం కరుగునా


తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా

గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా


దూరం కరిగినా… మౌనం కరుగునా

మౌనం కరిగినా అభిమానం కరుగునా


కొంటె కొంటె చూపులెన్నో… రెప్ప గడప దాటుతున్నా

గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా..?



నా కలలే సెలవే… నీ కలలే కొలువే


మూగ కడలై పొంగే మనసే… మూగ అలలే ఎగసెనే

మేఘమదిలో చినుకు వరసే… కరిగి కురిసేనెపుడులే


చిన్ని చిన్ని అడుగులెన్నో… నువ్వు వెళ్ళే దారిలోన

మధ్యనున్న అడ్డు గీత దాటలేనిదేనా


నీ పిలుపే మధురం

ఓ..! నీ తలపే కథనం


తేనె ఉనికే ఏది అంటే… పువ్వు ఎదలో స్థానమే

నాకు ఉనికే ఏది అంటే… నువ్వు నడిచే తీరమే


కొత్త కొత్త రోజులన్నీ కాలమల్లి జల్లుతున్నా

నువ్వు నేను అందులోన రేయి పగలమేనా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి