18, జులై 2021, ఆదివారం

మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం పాట లిరిక్స్ - Memadugesthe Adaraali Adhikaara Peetam Song Lyrics in Telugu - Baba (2002) Telugu Songs Lyrics













చిత్రం : బాబా (2002)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : శివగణేష్

గానం : కార్తీక్







 

మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం

మెమెదురొస్తే బెదరాలి భేతాళ భూతం


శక్తి నివ్వూ.. శక్తినివ్వూ..

శక్తి నివ్వూ.. శక్తినివ్వూ..

దేవా...దేవా...


తల్లివి నీవే తండ్రివి నీవే

ప్రణవము నీవే ప్రాణము నీవే

తల్లివి నీవే తండ్రివి నీవే

ప్రణవము నీవే ప్రాణము నీవే

రేణువు నీవే స్థాణువు నీవే

జులుమునణచుటకు 

గురిని గెలుచుటకు శక్తినివ్వూ

 

మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం

మేమెదురొస్తే బెదరాలి భేతాళ భూతం

శక్తి నివ్వూ..

 

నట్టేటి నావలనే నడిపించు శక్తినివ్వూ

మునిగేటి జీవులనే రక్షించు శక్తినివ్వూ

తల పొగరు సిగపట్టి ఈడ్పించు శక్తినివ్వూ

పేదింటి చీకటిని తొలగించు శక్తినివ్వూ

దావాగ్ని జ్వాలల్ని ఛేదించే శక్తినివ్వూ

నా మాటతో ఊరు మారేటి శక్తినివ్వూ

 

తల్లివి నీవే తండ్రివి నీవే

ప్రణవము నీవే ప్రాణము నీవే

దేవా...దేవా...

 

బిగిపట్టు పట్టాక సడలించబోను

ముందడుగు వేశాక వెనుకాడబోను

ననునమ్ము తమ్ముళ్ని వంచించబోను

ఓ నిచ్చెనై నిలుచుండి నేమోసపోను

నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను

నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను

నే బ్రతికేది నీ కొరకె విడిచి నే పోనూ

గద్దెలను మిద్దెలను నే కోరుకోను

కాలాల హద్దులను నే మించిపోను

దేవా... దేవా...

 

తల్లివి నీవే తండ్రివి నీవే

ప్రణవము నీవే ప్రాణము నీవే

తల్లివి నీవే తండ్రివి నీవే

ప్రణవము నీవే ప్రాణము నీవే

రేణువు నీవే స్థాణువు నీవే

జులుమునణచుటకు

గురిని గెలుచుటకు శక్తినివ్వూ


నేనడుగేస్తే అదరాలి అధికార పీఠం

నేనెదురొస్తే బెదరాలి భేతాళ భూతం

శక్తి నివ్వూ..శక్తి నివ్వూ..








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి