23, జులై 2021, శుక్రవారం

హైర హైర హైరబ్బా పాట లిరిక్స్ - Haira Haira Hairabba Song Lyrics in Telugu - Jeans (1998) Telugu Songs Lyrics















చిత్రం : జీన్స్ (1998)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : శివగణేష్, ఏ.ఎం.రత్నం

గానం : ఉన్నికృష్ణన్, పల్లవి

 







నాకే నాకా... నాకే నాకా...

నువు నాకే నాకా... ఆ...ఊఁ...

మధుమిత మధుమిత మధుమిత...

 

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

 

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా

ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

 

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా

ఫ్యాక్స్‌లొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా

ముద్దుల వానలొ నిను తడిపేనా

కురుల తోటే తడి తుడిచేనా

నిన్ను నేను కప్పుకొనేనా

పెదవిపైనే పవళించేనా

పట్టు పూవా పుట్ట తేన

నీ నడుం సగం తాకనివ్వమా

 

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా

ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

 

కలిసి ఇద్దరం చిరునడకలతో

అమెరికానే తిరిగొద్దాం

కడలిపై ఎరట్రి తివాచీ పరచి

ఐరోపాలో కొలువుందాం

మన ప్రేమనే కవి పాడగా

షెల్లీకి బైరన్‌కూ సమాధి

నిద్దర చెడగొడదాం

 

నీలాకాశమే దాటి ఎగరకూ

ఏమైనదో నీ మనసుకు

ఉల్లాసమో ఉత్సాహమో

ప్రేమ పిచ్చితో గాలై తిరగకు

ఏమైనదో నీ వయసుకు

ఆయాసమో ఆవేశమో

 

పైర గాలికి వయసాయే

నేల తల్లికి వయసాయే

కోటియుగాలైనాగానీ

ప్రేమకు మాత్రం వయసైపోదు

 

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా

ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

 

చెర్రీ పూలను దోచేగాలి

చెవిలో చెప్పెను ఐలవ్‌యూ

సైప్రస్ చెట్లలో దావుద్ పక్షి

నాతో అన్నది ఐలవ్‌యూ

నీ ప్రేమనే నువు తెలుపగ

గాలులూ పక్షులూ

ప్రేమ పత్రమై కుమిలినవో

 

ఒంటి కాలితో పూవే నిలిచెను

నీ కురులలో నిలిచేందుకే

పూబాల ఓ పూవెట్టనా

చిందే చినుకులు నేల వాలెను

నీ బుగ్గలే ముద్దాడ గా

నేనూ నిన్నూ ముద్దాడనా

 

హృదయ స్పందన నిలిచిననూ

ప్రాణముండును ఒక నిమిషం

ప్రియా నన్నూ నువ్వీడితే

మరుక్షణముండదు నాప్రాణం

 

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా

ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

 

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

పాకెట్ సైజు వెన్నెలలు నీకే నీకు

ఫ్యాక్స్‌లొచ్చిన స్త్రీ కవిత నీకే నీకు

 

నిన్ను నేను కప్పుకొనేనా

పెదవిపైనే పవళించేనా

ముద్దుల వానలో నిను తడిపేనా

కురులతోటే తడి తుడిచేనా

పట్టు పూవా పుట్ట తేనే

నీ నడుం సగం తాకనివ్వమా

హైర హైర హైరబ్బా...

హైర హైర హైరబ్బా...

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి