6, జులై 2021, మంగళవారం

నేడే మేడే మేడే మేడే పాట లిరిక్స్ - విప్లవ గీతాల సంచిక - 6 - Nede Mede Mede Mede Song Lyrics in Telugu - Erra Mallelu (1981) Telugu Songs Lyrics












చిత్రం : ఎర్ర మల్లెలు (1981)
సాహిత్యం : అదృష్ట దీపక్
సంగీతం : చక్రవర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం





అన్యాయం అక్రమాలు దోపిడిలు దురంతాలు
ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని నిలదీసినదీ రోజు

అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా
కదిలించినదీ రోజు రగిలించినదీ రోజు

నేడే మేడే మేడే మేడే

ఆ ఆ ఆ

సమభావం మానవాళి గుండెలలో నిండగా
సఖలదేశ కార్మికులకు ఈనాడే పండగ

లోకానికి శ్రమవిలువను చాటినరోజు
ఇది చీకటిలో చిరుదివ్వెలు వెలిగిన రోజు

నేడే మేడే మేడే మేడే

వేదనలు రోదనలు వేదనలు రోదనలు
అంతరింపచెయ్యాలని బాధల కేదారంలో
శోధన మొలకెత్తింది

చిరకాలపు దోపిడీపై తిరుగుబాటు జరిగినపుడు
చిందిన వెచ్చని నెత్తురు చేతనమై నిలిచింది

నేడే మేడే మేడే మేడే

భావనలో నవచేతన పదునెక్కిన ఆలోచన
రేపటి ఉదయం కోసం రెప్పలు విప్పాయి

ఆ ఆ ఆ ఆ

బిగిసిన ఈ పిడికిళ్లు ఎగసిన ఆ కొడవళ్లు
శ్రామిక జన సారధిగా క్రమించమని అడిగాయి

నేడే మేడే మేడే మేడే
నేడే మేడే మేడే మేడే

ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాలు
ఎన్నెన్నో తీరులలో చెమటోడ్చే శ్రమజీవులు

ఐక్యంగా నిలవాలి కథనానికి కదలాలి
సౌమ్యవాద సాధనకై సమరం సాగించాలి

నేడే మేడే మేడే మేడే








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి