చిత్రం : నారప్ప (2021)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : మణిశర్మ
గానం : ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్
తందానే నా నేన నేన నానా
తందానే నా నేన నేన నానా
తందానే నా నేన నేన నానా
తందానే నా నేన నేన నానా
చిలిపి చూపుల చలాకి చిన్నమ్మి
చలాకి చిన్నమ్మి
ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది
చలాకి చిన్నమ్మి
రాగి ముద్దవి నువ్వేరానీ కారమునే
నేనెలగే నిన్నిడిచి ఎలాగే ఉండేది
చలాకి చిన్నమ్మి
రానా నీతోటి ఇలాగే నినునమ్మి
ఇలాగే నినునమ్మి
రాల సీమంటి వయ్యారి వన్నెల్లో
వరాలే విరజిమ్మి వరాలే విరజిమ్మి
కిందాలెన్నైనా చేత్తానే నీతో
ఉండే నూరేళ్లు చూడాలి ఎంతో
రేగడి నేనైతే నాగలి నీ నవ్వే
దున్నితే పండాలి నా పంట
మంచే కట్టాలోయ్ ఈడు పొలంలో
కంచె పెంచాలోయ్ కన్నె కలల్లో
అంచైయి చేరలోయ్ కొక చివర్లో
కంచయి మోగాలి రైక కొనల్లో
యాలో యాల
కంకెలై కాయల క్షణాలే ఈ యేల
నువు నేను కొయ్యాల జతే మోసెయ్యాల
కంది చేలోన జోరీగల్లాగా
జోడై ఎగిరేద్దాం రాయే సరదాగా
వేమన అవతారం ఎన్నడే బంగారం
అన్నది నా ఆత్రం భారంగా
చాల్లే చాలబ్బి సంబడమిట్టా
లగ్గా లేకుండా సందడులెట్టా
నీకై దాచానీ పల్లము మిఠా
నువ్వేయ్ దాటెయ్ నా సిగ్గుల కట్ట
పిల్ల గాలే పిచ్చిగా ఊదాలే
పిపిపి డుం డుం డుం లే
పిపిపి డుం డుం డుం లే
పిపిపి డుం డుం డుం లే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి