చిత్రం : అమృత (2002)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : సుజాత, శ్రీనివాస మూర్తి,టిప్పు, కార్తీక్, మధుమతి
ఆకసాన మేఘమాల ఉరుకు మానునా
అమృతం గూటిలోన అణిగి ఉండునా..
సుందరీ... జంటతోకల సుందరీ..
సుందరీ... జంటతోకల సుందరీ..
హే .. వదరకే పసిదానా... హే
హే అలజడి అలల సుందరీ..
హే హే హే హే
సుందరీ... జంటతోకల సుందరీ..
సుందరీ... జంటతోకల సుందరీ..
హే.. హే.. నల్లనారి నువ్వేనమ్మా..
పంచదార చిలకవమ్మ..
ఆకసాన మేఘమాల ఉరుకు మానునా
అమృతం గూటిలోన అణిగి ఉండునా..
చిన్న చిన్న తప్పులేమో దినము దినము దొర్లుతాయి
పొంగి వచ్చె కోపాన్ని పూత నవ్వె తుడిచెనమ్మ..
కలత తీర్చే సొట్ట బుగ్గ.. జడలలో మేఘాలే ఊగే
ఆనందపు అంచు ఆమె .. తొలిచేసే బాధ ఆమె
చలిముళ్ళ తెమ్మెర ఆమేలే
అలలు పట్టి తాట చుట్టి కట్టుట సాధ్యమైన పనియా
ఈమెగారి ఆప మనకు ఇక తరమా.. ఆఆఆఅ
సుందరీ... జంటతోకల సుందరీ..
హే .. వదరకే పసిదానా... హే
హే అలజడి అలల సుందరీ..
హే హే హే హే ఏహే..
పాలపళ్ళ పాలపిట్ట చెక్కిట్లో చిటిక్కున
పాయసాల ముద్దులిస్తే పసిడి కానుకే
చిట్టితల్లి అమ్మలకు కన్నతల్లి ఈమెకాద
మల్లెలాంటి కూతురైన మారుతల్లి ఈమెకాద
బడికి వెళితే విలన్ తెలుసా ..?
మార్కులో హీరోయిన్ తెలుసా.. ?
అడిగేను ప్రశ్నలు వేయి..
తనకు పెద్ద తెలుసు బడాయి
టీచర్ కి ఇంటిలోన పంతులమ్మ..
ఎవడు దీన్ని మనువాడి ఎన్ని పాట్లు పడునో
ఇది చేసుకున్న వాడు రేపు చెంపలేసుకుంటాడు
హో..హో..హో..హో..హో..
సుందరీ... జంటతోకల సుందరీ..
సుందరీ... జంటతోకల సుందరీ..
హే .. వదరకే పసిదానా... హే
హే అలజడి అలల సుందరీ..
హే హే హే హే
సుందరీ... జంటతోకల సుందరీ..
సుందరీ... జంటతోకల సుందరీ..
హే.. హే.. నల్లనారి నువ్వేనమ్మా..
పంచదార చిలకవమ్మ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి