చిత్రం : రంగేళి (రంగీలా) (1995)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : యస్.జానకి
రంగేళీ రే..
యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే..
యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే..
జనమందరిలో మనమెవరంటే
తెలిసుండాలి ఒక విలువుండాలి
ఘనచరితలు గల కొందరిలో
మన పేరుండాలి తగు ప్లేసుండాలి
నలుగురూ గొప్పగా చూడగా
ప్రతిదినం కొత్తగా ఉండగా
బతకడం అప్పుడే పండుగా
యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే..
లోకంలోనే ఉంటూ చుట్టూ బతుకును చూస్తూ
జీవించటమంటేనే తెలియనివాళ్ళను చూస్తే జాలి
కనిపించని తలరాత అరచేతుల్లో గీత
బతుకును నడిపిస్తాయని
నమ్మే వాళ్ళను ఏం చెయ్యాలి?
ఊరికే ఊహలో ఉండక
నిజముగా మార్చుకో కోరిక
నింగిలో నిలిచిపో తారగా
యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే..
రంగేళీ..రే..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి