28, జులై 2021, బుధవారం

లాలి లాలి అను రాగం సాగుతుంటే పాట లిరిక్స్ - Laali Laali Anu Raagam Saaguthunte Telugu Song Lyrics - Indira (1995) Telugu Songs Lyrics





చిత్రం : ఇందిర (1995) 

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి  

గానం : హరిణి   

 

ఆఆఆఆఆ...ఆఆఆఆఆ...


లాలి లాలి అను 

రాగం సాగుతుంటే 

ఎవరూ నిదుర పోరే

చిన్నపోదా మరి చిన్ని ప్రాణం

 

కాసే వెన్నెలకు వీచే గాలులకు 

హృదయం కుదుట పడదే

అంత చేదా మరీ వేణు గానం

 

కళ్ళు మేలుకుంటే 

కాలమాగుతుందా 

భారమైన మనసా

ఆ... పగటి బాధలన్నీ 

మరచిపోవుటకు 

ఉంది కాదా ఈ ఏకాంత వేళ

 

లాలి లాలి అను 

రాగం సాగుతుంటే 

ఎవరూ నిదుర పోరే

చిన్నపోదా మరి చిన్ని ప్రాణం

 

స మ గ ప ప మ ప మ 

గ రి గ రి స ని 

స మ గ ప ప మ ప మ 

స మ గ ప ప మ ప మ 

గ రి గ రి స ని 

స మ గ ప స ర మ 

ఆ ...

గ మ ద ద మ ని ని ద 

స రి స ని ద ప 

గ మ ద ద మ ని ని ద 

గ రి స ని ద ప మ ద 

 

ఏటో పోయేటి నీలి మేఘం 

వర్షం చిలికి వెళ్ళదా 

స రి గ రి గ గ రి గ ప మ గ 

ఎదో అంటుంది కోయల 

పాట రాగం ఆలకించరా 

స రి గ రి గ గ రి గ ప మ గ

అన్ని వైపులా మధువనం 

పూలు పూయదా అను క్షణం 

అణువణువునా జీవితం 

అందచేయదా అమృతం 

 

లాలి లాలి అను 

రాగం సాగుతుంటే 

ఎవరూ నిదుర పోరే

చిన్నపోదా మరీ చిన్ని ప్రాణం

 

కాసే వెన్నెలకు వీచే గాలులకు 

హృదయం కుదుట పడదే

అంత చేదా మరీ వేణు గానం 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి