4, జులై 2021, ఆదివారం

ఏ కన్నులూ చూడనీ చిత్రమే పాట లిరిక్స్ - Ye Kannulu Choodani Chitrame Song Lyrics in Telugu - Ardha Satabdam (2021) Telugu Songs Lyrics







చిత్రం : అర్ధశతాబ్దం (2021)
సంగీతం : Nawfal Raja Ais
సాహిత్యం : రహ్మాన్ 
గానం : సిద్ శ్రీరామ్


ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నదీ నేడు నా ప్రాణమే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించె ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నదీ నేడు నా ప్రాణమే

ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా
కొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనా
దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా
నువ్వు చూడగానే దాగిపోతువున్నా
నినుతలచీ ప్రతినిమిషం
పరవశమై పరుగులనే 
తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా..
 
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నదీ నేడు నా ప్రాణమే
 
రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా
నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిదీ తెలియదులే
మనసుకిదీ మధురములే
నాలో నే మురిసి ఓ వేకువలా 
వెలుగైవున్నా..!
 
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నదీ నేడు నా ప్రాణమే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి