20, జులై 2021, మంగళవారం

తాను నేను మొయిలు మిన్ను పాట లిరిక్స్ - Taanu Nenu Moilu Minnu Song Lyrics in Telugu - Saahasam Swasaga Saagipo (2016) Telugu Songs Lyrics

















చిత్రం : సాహసం శ్వాసగా సాగిపో (2016)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : అనంత శ్రీరామ్

గానం : విజయ్ ప్రకాష్

 






తాను నేను మొయిలు మిన్ను

తాను నేను కలువ కొలను

తాను నేనూ పైరు చేను

తానూ నేనూ వేరు మాను

శశి తానైతే నిశినే నేనూ

కుసుమం తావి తానూ నేను

వెలుగు దివ్వె తెలుగు తీపి

తానూ నేనూ మనసు మేను

 

దారి నేను తీరం తాను

దారం నేను హారం తాను 

దాహం నేను నీరం తాను

కావ్యం నేను సారం తాను

నేను తాను రెప్ప కన్ను

వేరైపోని పుడమి మన్ను

నేను తాను రెప్ప కన్ను

వేరైపోని పుడమి మన్ను

 

తాను నేను మొయిలు మిన్ను

తాను నేను కలువ కొలను

తాను నేను గానం గమకం

తాను నేను ప్రాయం తమకం. 

 

తాను నేను మొయిలు మిన్ను

తాను నేను కలువ కొలను

తాను నేనూ పైరు చేను

తానూ నేనూ వేరు మాను

శశి తానైతే నిశినే నేనూ

కుసుమం తావి తానూ నేను

వెలుగు దివ్వె తెలుగు తీపి

తానూ నేనూ మనసు మేను 

మనసు మేను మనసు మేను

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి