చిత్రం : ఎర్ర సైన్యం (1994)
సాహిత్యం : గూడ అంజయ్య
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
సుత్తె మనది కత్తి మనది పలుగు మనది
పారా మనది యాఆఁ
బండి మనదిరా బండెండ్లు మనయిరా
బండి మనదిరా బండెండ్లు మనయిరా
నడుమ దొర ఏందిరో వాడి పీకుడేందిరో
నడుమ దొర ఏందిరో వాడి పీకుడేందిరో
ఏయ్ జాలిమ్ కౌన్ రే ఉస్కా జులూమ్ క్యారే
జాలిమ్ కౌన్ రే ఉస్కా జులూమ్ క్యారే
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
అరకలు పట్టేది మనం సెలకలు దున్నేది మనం
అరకలు పట్టేది మనం సెలకలు దున్నేది మనం
కంచె కాడ మనం ఆ మంచ కాడ మనం
ఏయ్ కాడ మనం ఆ మంచ కాడ మనం
పాడి కాడ మనం ఆ పశుల కాడ మనం
పాడి కాడ మనం ఆ పశుల కాడ మనం
దొడ్డి కాడ మనమే గడ్డాము కాడ మనమే
దొడ్డి కాడ మనమే గడ్డాము కాడ మనమే
నడుమ దొర ఏందిరో వాని పీకుడేందిరో
నడుమ దొర ఏందిరో వాని పీకుడేందిరో
ఏయ్ జాలిమ్ కౌన్ రే ఉస్కా లూటీ క్యారే
జాలిమ్ కౌన్ రే ఉస్కా లూటీ క్యారే
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
సమ్మెట పట్టేది మనం బరువులు మోసేది మనం
సమ్మెట పట్టేది మనం బరువులు మోసేది మనం
చాకిరేవు కాడ మనం సారెలు తిప్పేది మనం
చాకిరేవు కాడ మనం సారెలు తిప్పేది మనం
మగ్గం పెట్టింది మనం పగ్గం పేరేది మనం
మగ్గం పెట్టింది మనం పగ్గం పేరేది మనం
చావు కాడ మనమే సన్నాయి కాడ మనమే
చావు కాడ మనమే సన్నాయి కాడ మనమే
నడుమ దొర ఏందిరో వాడి పోకడేందిరో
నడుమ దొర ఏందిరో వాడి పోకడేందిరో
ఏయ్ జాలిమ్ కౌన్ రే ఉస్కా ఝామండు క్యారే
జాలిమ్ కౌన్ రే ఉస్కా ఝామండు క్యారే
యాఆఁ
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
కాయ కష్టం చేసి కాళ్ళు గుంజి కూకుంటే
కాయ కష్టం చేసి కాళ్ళు గుంజి కూకుంటే
పసి బిడ్డ ఏడుపిని పాలియ్యా బోతుంటే
పసి బిడ్డ ఏడుపిని పాలియ్యా బోతుంటే
గట్టుమీద కుర్రోడు చెట్టులెక్క నిలిసుంటే
గట్టుమీద కుర్రోడు చెట్టులెక్క నిలిసుంటే
ఆలి నుండి అమ్మ దాకా వాయి వరస లేకుండా
ఆలి నుండి అమ్మ దాకా వాయి వరస లేకుండా
ఆ .. తిట్టుడేందిరో వాడి కొట్టుడేందిరో
తిట్టుడేందిరో వాడి కొట్టుడేందిరో
అరెరెరె జాలిమ్ కౌన్ రే ఉస్కా జులూమ్ క్యారే
జాలిమ్ కౌన్ రే ఉస్కా జులూమ్ క్యారే
ఏయ్
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
సుత్తె మనది కత్తి మనది పలుగు మనది
పారా మనది యాఆఁ
బండి మనదిరా బండెండ్లు మనయిరా
బండి మనదిరా బండెండ్లు మనయిరా
నడుమ దొర ఏందిరో వాడి పీకుడేందిరో
నడుమ దొర ఏందిరో వాడి పీకుడేందిరో
జాలిమ్ కౌన్ రే ఉస్కా జులూమ్ క్యారే
జాలిమ్ కౌన్ రే ఉస్కా జులూమ్ క్యారే
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
ఊరు మనదిరా ... ఈ వాడ మనదిరా ...
పల్లె మనదిరా ... ప్రతి పనికి మనంరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి