20, జులై 2021, మంగళవారం

నమ్మవే చెలీ నిన్ను నేను ప్రేమిస్తున్నానే పాట లిరిక్స్ - Nammave Cheli Ninnu Nenu Premisthunnane Song Lyrics in Telugu - Nuvvante Nenani (2021) Telugu Songs Lyrics





చిత్రం : నువ్వంటే నేనని (2021)

సాహిత్యం : వరికుప్పల యాదగిరి 

సంగీతం : వరికుప్పల యాదగిరి 

గానం : సిద్ శ్రీరామ్ 



నమ్మవే చెలీ నిన్ను నేను ప్రేమిస్తున్నానే 

నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే 


కంటిలోన పాపాల ఉండిపోవే 

గుండెలోన ఊపిరై నిండిపోవే 


నమ్మవే చెలీ నిన్ను నేను ప్రేమిస్తున్నానే 

నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే


నీవు లేని లోకమంతా శూన్యమల్లే తోస్తుంది 

చావురాక ఉండలేక బ్రతుకు నరకమౌతుంది 


తోడు ఉంటె ప్రపంచమంతా వసంతమై పూస్తుంది 

నీడలాంటి నిన్ను చూసి మనసు మురిసిపోతుంది


పున్నమేల వెన్నలున్న నీవు లేక చీకటేలే 

కన్నులున్న కానరాక గుండెలోన బాధ రగిలే 


రాతిరైతే నిద్దరైనా రాను రాను పొమ్మంటుంది  


నమ్మవే చెలీ నిన్ను నేను ప్రేమిస్తున్నానే 

నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే 


దూరమైతే గుండెకూడా భారమై పోతుంది 

దగ్గరైతే గొంతు దాటి మాట కూడ రాకుంది  


చేరువై కౌగిలి ఇస్తే వొదిగిపోవాలని ఉంది 

మరుగుతున్న గుండెలోకి చలువ చేరుకుంటుంది 


కళ్ళలోకి చూసావంటే నీ రూపు కనబడుతుంది 

తల్లడిల్లి పోతూవున్న మనసు బాధ తెలిసోస్తుంది



కళ్ల కాదు నాలో ప్రేమ 

ప్రాణమైన అర్పిస్తుంది 


నమ్మవే చెలీ నిన్ను నేను ప్రేమిస్తున్నానే 

నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే 


కంటిలోన పాపాల ఉండిపోవే 

గుండెలోన ఊపిరై నిండిపోవే 


నమ్మవే చెలీ నిన్ను నేను ప్రేమిస్తున్నానే 

నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే


నమ్మవే చెలీ నిన్ను నేను ప్రేమిస్తున్నానే 

నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి