ఈరోజు నుంచి తెలుగు చిత్రాల్లోని
విప్లవ గీతాలను తలచుకుందాం
చిత్రం : లాల్ సలాం (1992)
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని
ఎవడురా తెగ వాగింది ఎర్రజెండ వరిగిందని
తూర్పున సూర్యుడు పొడిచినంత కాలం
రక్తం ఎర్రగ నిలిచినంత కాలం
అజేయంరా విప్లవం దాన్నాపటం ఎవడబ్బతరం
అజేయంరా విప్లవం దాన్నాపటం ఎవడబ్బతరం
నో నెవర్
ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని
ఎవడురా తెగ వాగింది ఎర్రజెండ వరిగిందని
లెనిన్ విగ్రహం కాడురా కూల్చేస్తే ముక్కలైపోడురా
లేనీనంటే అట్ట అడుగు జనంరా పడిలేచాడా ప్రళయాగ్నిరా
ఆకలితో నిరుపేదల కడుపులు అరిచినంత కాలం
శ్రమజీవుల కళ్ళల్లో కన్నీరొలికినంత కాలం
ఆగదు విప్లవ చైతన్యం
పోరాడుతుందిరా జాణసైన్యం
యస్ ఫరెవర్ !!
ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని
ఎవడురా తెగ వాగింది ఎర్రజెండ వరిగిందని
ఈ విత్తు మార్క్స్ నాటిందిరా
ఈ చెట్టు లెనిన్ పేర్చిందిరా
వీరుల రక్తంతో తడిసి ఇది వెయ్యి కొమ్మలయ్యిందిరా
ఈ కొమ్మలు నరికేదెవడురా
ఈ పళ్ళను దోచేదెవడురా
ఎవడురా ఆ .. ఎవడు ... ఎవడు ...
ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని
ఎవడురా తెగ వాగింది ఎర్రజెండ వరిగిందని
ఎవడైనా బరితెగించి వస్తే ఎదురుగ నిలిచి సవాల్ చేస్తే
దళితుల ఊపిరి ఉప్పెనగా నిర్భాగ్యుల గుండెలు నిప్పులుగా
దళితుల ఊపిరి ఉప్పెనగా నిర్భాగ్యుల గుండెలు నిప్పులుగా
చెమటోడ్చే కండలు బండలుగా
బతుకీడ్చే పేదలు దండులుగా
ఉరిమిపడి తిరగపడి
ఉరిమిపడి తిరగపడి
భూస్వాములను బూర్జువాలను
భూస్థాపితం చేసేస్తాం
విప్లవానికి తిరుగులేదని ఎర్రజెండాకు ఎదురులేదని
విశ్వమంతటా ఘోషిస్తాం
శ్రమ శక్తిదే గెలుపని శాసిస్తాం
శ్రమ శక్తిదే గెలుపని శాసిస్తాం
శాసిస్తాం శాసిస్తాం శాసిస్తాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి