7, జులై 2021, బుధవారం

సిగ్గు సిగ్గుఅంటవు సిగ్గెందిరో పాట లిరిక్స్ - విప్లవ గీతాల సంచిక - 7 - Siggu Sigguantavu Siggendiro Telugu Song Lyrics - Nava Bhaaratham (1988) Telugu Songs Lyrics






చిత్రం : నవభారతం (1988)
సాహిత్యం : వంగపండు
సంగీతం : చక్రవర్తి
గానం : రమణ, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సిగ్గు సిగ్గుఅంటవు సిగ్గెందిరో
సిగ్గుపడే పని చెయ్యలేదురో

సిగ్గు సిగ్గుఅంటవు సిగ్గెందిరో
సిగ్గుపడే పని చెయ్యలేదురో

కూలి నాలి కడుపు కొట్టి
కోట్లు గుంజుకోలేదు

నల్ల డబ్బు పంచిపెట్టి నాయకుడ్ని కాలేదు
అడ్డమైన పనులు చేసి అధికారిని కాలేదు

దరిద్రాన్ని తలుచుకుంటే చరిత్రకే సిగ్గుచేటు
పేరు గొప్ప ఊరు దిబ్బ కొట్టబాకు నీ డప్పా

సిగ్గు సిగ్గుఅంటవు సిగ్గెందిరో
సిగ్గుపడే పని చెయ్యలేదురో

సిగ్గు సిగ్గుఅంటవు సిగ్గెందిరో
సిగ్గుపడే పని చెయ్యలేదురో

చదువుకోండి చదువుకోండి చవకబారు ఎధవలార
చదువుకుంటే మీకెన్నో సదుపాయాలన్నారని

పుస్తెల తాడు అమ్ముకొని పుస్తకాలే కొన్నారు
పేగులేండ పెట్టుకొని ఫీజులెన్నో కట్టారు

కన్నకొడుకు చదువుకుని కష్ఠపడిన తండ్రి
ఇల్లు ఒళ్ళు గుల్లాయేన సిగ్గు సిగ్గు
ముళ్లకంప బతుకాయేనా సిగ్గు సిగ్గు

బడా చదువు చదివినా బండిని లాగిస్తున్నా
నాయకులకు లేని సిగ్గు నడుమ నాకెందుకురో

సిగ్గు సిగ్గుఅంటవు సిగ్గెందిరో
సిగ్గుపడే పని చెయ్యలేదురో

ఉద్యోగం వస్తుందని బ్రతుకు తెరువు తెస్తుందని
ఎంప్లాయిమెంటులోన పేరు నమోదు చేస్తే

ఇంటర్వ్యూ కార్డుకని కాకి కాకిలాగ కాసి కాసి
కాళ్ళ చెప్పులరిగిపోయే కడుపంత రగిలిపోయే

నల్లా ఈక పండిపోయి తెల్ల ఇక పుట్టుకొచ్చే
కంప్యూటర్ కుంపటొచ్చేనా సిగ్గు సిగ్గు
కోట్ల జనం కడుపు కొట్టేనా సిగ్గు సిగ్గు

మరమనిషిని తెచ్చి పెట్టేనా సిగ్గు
మనిషి నోట మట్టికొట్టేనా సిగ్గు

కొండ నాలికయ్యిందని మహామహులు మందేస్తే
ఉన్న నాలికూడిపాయే ముండమోపి బతుకాయే

సిగ్గు సిగ్గుఅంటవు సిగ్గెందిరో
సిగ్గుపడే పని చెయ్యలేదురో

మంత్రిగారి మనవడని ఉంచినారు ఒక సీటు
ఆఫీసర్ చుట్టామని ఆపినారు ఒక సీటు

అమ్మగారి ఇనాకని అయ్యగారి గులామనీ
సలాము కొట్టోడికల్లా సరాసరి ఉద్యోగం

దళారోడు జులాయివోడు దర్జాగా బతుకుంటే
డిగ్రీ డింకీలు కొట్టేనా సిగ్గు సిగ్గు
మా కడుపులు కొట్టేనా సిగ్గు

ఉన్న సీట్లు అన్ని కలిపి ఉన్నోడికి పంచిపెడితే
పెద్దోళ్ళకు లేని సిగ్గు కొద్దోళ్ళకు మాకెందుకు

సిగ్గు సిగ్గుఅంటవు సిగ్గెందిరో
సిగ్గుపడే పని చెయ్యలేదురో

అరె ఈ దారుణ నేరాలు ఇకనైనా ఆపకుంటే
ఇదే తీరు పదే పదే యువశక్తిని కష్టపడితే
ఆ శక్తే కాళీకయ్యి నాలుక ఎగ జాపుతుంది

అగ్ని వృష్టి కురిపించి అవినీతిని కాల్చుతుంది
అక్రమాన్ని కడతేర్చి సక్రమాన్ని నేర్పుతుంది

ఆనాడే అభ్యుదయంరా నిజం నిజం
అందాక నిద్రపోకురా అదే నిజం

నవశక్తిగా సంఘటించరా క్షణం క్షణం
నవభారత సృష్టి చెయ్యరా ప్రతిక్షణం

విధ్యే విజ్ఞానమనే విపరీతార్ధాలు మాని
సంవృద్ధిగా బ్రతికించే స్వయం శక్తివై రారా

యువసమాజం మేలుకుందిరో
నవసమాజం కోరుకుందిరో

యువసమాజం మేలుకుందిరో
నవసమాజం కోరుకుందిరో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి