31, జులై 2021, శనివారం

మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా పాట లిరిక్స్ - Mari Anthaga Maha Chinthaga Moham Telugu Song Lyrics - Seethamma Vaakitlo Sirimalle Chettu (2012) Telugu Songs Lyrics





చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)

సాహిత్యం : అనంత శ్రీరామ్ 

సంగీతం : మిక్కీ జె మేయర్

గానం : శ్రీ రామచంద్ర



మరీ అంతగా మహా చింతగా 

మొహం ముడుచుకోకలా

పనేం తోచక పరేషాన్ గా గడబిడ పడకు అలా


మతోయేంతగా శృతే పెంచక 

విచారాల విల విలా

సరే చాలిక అలా జాలిగా తికమక పడితె ఎలా 


కన్నీరై కురవాలా 

మన చుట్టూ ఉండే లోకం తడిసేలా

ముస్తాబే చెదరాలా 

నిను చూడాలంటే అద్దం జడిసేలా


ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా 

కదా ...  మరెందుకు గోల 

అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా 

వృధా ప్రయాస పడాల


మరీ అంతగా మహా చింతగా 

మొహం ముడుచుకోకలా

సరే చాలిక అలా జాలిగా తికమక పడితె ఎలా


ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా  

చలినెటో తరిమేస్తామా చీ పొమ్మనీ

కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా 

రోజులతొ రాజీ పడమా.. సర్లెమ్మనీ 


సాటి మనుషులతో మాత్రం 

సాగనని ఎందుకు పంతం

పూటకొక పేచీ పడుతూ 

ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం


ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా 

కదా ...  మరెందుకు గోల 

అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా 

వృధా ప్రయాస పడాల


చమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా 

పెదవిపై చిగురించేలా చిరునవ్వులు 

కండలను కరిగించాలా కొండలను కదిలించాలా 

చచ్చి చెడి సాధించాలా సుఖ శాంతులు


మనుషులనిపించే ఋజువు 

మమతలను పెంచే ఋతువు 

మనసులను తెరిచే హితవు 

వందేళ్ళయినా వాడని చిరునవ్వు


ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా 

కదా ...  మరెందుకు గోల 

అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా 

వృధా ప్రయాస పడాల


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి