చిత్రం : ఎవ్వరికీ చెప్పొద్దు (2019)
సాహిత్యం : వాసు వలబోజు
సంగీతం : శంకర్ శర్మ
గానం : యాజిన్ నిజార్, సమీరా భరద్వాజ్
ఆపే వీలే లేని
హద్దే లేని ఆనందాన
నన్నే నేనే నమ్మే
మాటే లేదు ఈ మైకాన
భూకంపం వస్తే రాని
భూగోళం పోతే పోనీ
ఈరోజు ఈ సంతోషాన్ని
ఆపే వీలుందా
అయ్యేది అయితే కాని
వందేళ్ల ఆనందాన్ని
పొందేద్దాం రావే మనసా
ఆపే వీలే లేని
హద్దే లేని ఆనందాన
నన్నే నేనే నమ్మే
మాటే లేదు ఈ మైకాన
కడలి తెగిన వేగమిది
పిడుగు పడిన ఆగదిది
కనని వినని వేడుకిది
కల దొరికినది
నడక పరుగు నేర్చినది
అరుపోక పిలుపైన మది
ఎగసి పడిన ఉప్పెనలా
వయసురికినది
మొదటి అడుగు ఈరోజే
నను అడగక సాగిందా
పడుచుతనము మంచల్లే
కరిగిన కథ నాదా ఇది నిజమా
ఇలా ఏలా ఇలా ఎలా ....
అడుగు కదలని నా చిరు ఆశకు
పరుగు కలదని నేర్పిన నేస్తమా
కలకు దొరకని సంబరమే ఇది
క్షణము క్షణమోక పండుగ అయినది
ఏన్నో ఏన్నో అద్భుతాల్ని
చూపిస్తా నీ వెంట రాని
నా కన్నుల్తో చూడు నీ కల
ఆశే ఉంటే కోరుకోని
ఆశ నాతో తీరిపోని
గుండెల్లోనే దాచేస్తే ఎలా
ఆపే వీలే లేని
హద్దే లేని ఆనందాన
నన్నే నేనే నమ్మే
మాటే లేదు ఈ మైకాన
భూకంపం వస్తే రాని
భూగోళం పోతే పోనీ
ఈరోజు ఈ సంతోషాన్ని
ఆపే వీలుందా
అయ్యేది అయితే కాని
వందేళ్ల ఆనందాన్ని
పొందేద్దాం రావే మనసా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి