26, జులై 2021, సోమవారం

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే పాట లిరిక్స్ - Prema Parichayame Daiva Darsaname Telugu Song Lyrics - 24 (2016) Telugu Songs Lyrics





చిత్రం : 24 (2016)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : చంద్రబోస్ 

గానం : హృదయ్ గట్టాని, చిన్మయి


 

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

ప్రేమ స్వరములలో దైవ స్మరణములే

అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో

మది మునిగింది నీ ప్రేమలో

 

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

ప్రేమ అడుగులలో దేవతార్చనలే

 

కోకిలసలు కోరుకొనని ప్రేమ తపస్సు మనదిలే

అతిధులెవరు ఎదురు పడని ప్రేమ తిధులు మనవే

అమృతములు ఎగసిపడిన ప్రేమ నదులు మనవే 

చరితల కాగితాల లోన చదవలేని ప్రేమనే

నీలో చదివా ఈ క్షణాలలో

 

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

ప్రేమ అడుగులలో దేవతార్చనలే

 

హృదయ గళము పాడుతున్న ప్రేమ గీతి మనదిలే

కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే

పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే

మనుషుల ఊహాలోన సైతం ఉండలేని ప్రేమతో

ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో

 

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

ప్రేమ అడుగులలో దేవతార్చనలే

అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో

మది మునిగింది నీ ప్రేమలో

 

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

ప్రేమ స్వరములలో దైవ స్మరణములే

అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో

మది మునిగింది నీ ప్రేమలో

 

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి