28, జులై 2021, బుధవారం

ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే పాట లిరిక్స్ - Aasa Aaganande Ninnu Choodakunte Telugu Song Lyrics - Cheliya (2017) Telugu Songs Lyrics






చిత్రం : చెలియా (2017)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : అభయ్ జోద్పూర్కర్, చిన్మయి


 

ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే

శ్వాస ఆడనందే అంత దూరముంటే

నన్నే మల్లెతీగలా నువ్వూ అల్లకుంటే

నిలువెత్తు ప్రాణం నిలవదటే

 

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్

నా చిట్టి చిలకా జట్టై అల్లేయ్ 

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్

ఏమంత అలకా చాల్లే అల్లేయ్

 

నిను వెతికే నా కేకలకు మౌనమె బదులైందే

మౌనములోని మాటిదని మనసె పోల్చుకుందే

లాలన చేసే వీలే లేని పంతం వదిలి పలకవటే

 

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్

పుప్పొడి తునకా గాలై అల్లేయ్

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్

పన్నీటి చినుకా జల్లై అల్లేయ్

 

ముడి పడిపోయాం ఒక్కటిగా విడివడీ పోలేకా

కాదనుకున్నా తప్పదుగా వాదనా దేనికికా

పదునుగ నాటే మన్మథ బాణం 

నేరం ఏమి కాదు కదే 

 

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్

నా జత గువ్వా జట్టై అల్లేయ్

అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్

నా చిరునవ్వా జల్లై అల్లేయ్ 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి