5, జులై 2021, సోమవారం

ఆనందమానంద మదికే ఏమందం ఏమందమొలికే పాట లిరిక్స్ - Anandamaananda Madike Yemandam Yemandamolike Song Lyrics in Telugu - Ishq (2021) Telugu Songs Lyrics







చిత్రం : ఇష్క్ (2021)
సంగీతం : మహతి స్వరసాగర్    
సాహిత్యం : శ్రీమణి 
గానం : సిద్ శ్రీరామ్, సత్య యామిని


ఏమైందో ఈ వేళ ఈ గాలి
రంగులేవో చల్లిందా.. ఓహో.. 
అందమైన ఊహేదో మదిలో వాలి
అల్లరేదో చేసిందా... ఓహో..

మెత్తనైన నీ పెదవులపై 
నా పేరే రాశావా
నే పలికే భాషే నువ్వయావే వెన్నెలా
రెండు కన్నులెత్తి గుండెలపై
నీ చూపే గీశావా
ఆ గీతే దాటి అడుగునైనా
విడువలేనే నేనిలా

ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే 
వెలుగే వెన్నెలా
ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే 
పొంగే వరదలా

మిలమిల మెరిసే 
కనుచివరలే మిణుకుల్లా
విసరకు నువ్వే 
నీ చూపులే మెరుపుల్లా
మెరిసెనా మెల్లగా
దారిలోన మల్లెల వాన
కురిసెనా ధారగా 
రంగు రంగు తారలతోనా
వీణలై క్షణాళిలా 
స్వరాలూ పూసేనా
ప్రేమలో ఓ నిమిషమే 
యుగాలు సాగేనా

ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే 
వెలుగే వెన్నెలా
ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ పిలుపు నా అడుగు 

నదికే పొంగే వరదలా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి