25, జులై 2021, ఆదివారం

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా పాట లిరిక్స్ - Preminche Premavaa Oorinche Oohavaa Song Lyrics in Telugu - Nuvvu Nenu Prema (2006) Telugu Songs Lyrics


















చిత్రం : నువ్వు నేను ప్రేమ (2006)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : నరేష్ అయ్యర్, శ్రేయా ఘోషల్

 








ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా

ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే


నే నేనా అడిగా నన్ను నేనే

నే నీవే హృదయం అన్నదే

ప్రేమించే నా ప్రేమవా 

ఊరించే ఊహవా

ప్రేమించే ప్రేమవా 

పూవల్లె పుష్పించే

 

రంగు రంగోలి

గొరింటే నువ్వు పెట్టే 

రంగే పెట్టిన రేఖలు మెరిసి 

గాజుల సవ్వడి ఘల్ ఘల్

 

రంగు రంగోలి 

గొరింటే నువ్వు పెట్టే 

రంగే పెట్టిన రేఖలు మెరిసి

సుందరి కన్నులు చందనమద్దిన 

చల్లని పున్నమి వెన్నెల విందులు

 

పూవైనే పూస్తున్నా 

నీ పరువంగానే పుడతా

మధు మాసపు మాలల 

మంటలు రగిలించే ఉసురై

 

నీవే నా మదిలో అడ 

నేనే నే నటనై రాగా

నా నాడుల నీ రక్తం 

నడకల్లో నీ శబ్దం ఉందే హో

తోడే దొరకని నాడు 

విలవిలలాడే ఒంటరి మీనం 

 

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా

నే నేనా అడిగా నన్ను నేనే

నే నేనా అడిగా నన్ను నేనే

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా

 

నెల నెల వాడుక అడిగి 

నెలవంకల గుడి కడదామా

నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా

తుమ్మెద తేనెలు తేలే 

నీ మదిలో చోటిస్తావా

నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించా తరమా

నీవు సంద్రము చేరె

గల గల పారే నది తెలుసా

 

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా

ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే


నే నేనా అడిగా నన్ను నేనే

నే నీవే హృదయం అన్నదే

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా

ప్రేమించే నా ప్రేమవా పూవల్లె పూవల్లె..

 

రంగు రంగోలి

గొరింటే నువ్వు పెట్టే 

రంగే పెట్టిన రేఖలు మెరిసి 

గాజుల సవ్వడి ఘల్ ఘల్

 

రంగు రంగోలి 

గొరింటే నువ్వు పెట్టే 

రంగే పెట్టిన రేఖలు మెరిసి

సుందరి కన్నులు చందనమద్దిన 

చల్లని పున్నమి వెన్నెల విందులు

 

రంగు రంగోలి

గొరింటే నువ్వు పెట్టే 

రంగే పెట్టిన రేఖలు మెరిసి 

గాజుల సవ్వడి ఘల్ ఘల్

 

రంగు రంగోలి 

గొరింటే నువ్వు పెట్టే 

రంగే పెట్టిన రేఖలు మెరిసి

సుందరి కన్నులు చందనమద్దిన 

చల్లని పున్నమి వెన్నెల విందులు

 

 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి