చిత్రం : అలజడి (1990)
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : విద్యాసాగర్
గానం : మనో
నేస్తమా అనంత యాత్రలో
ఏకాంత రాత్రిలో నిరాశలో
శోకమే నీ నీడలాగ వెంటనుండి సాగితే
శోకమే నీ నీడలాగ వెంటనుండి సాగితే
డోంట్ వర్రీ బీ హ్యాపీ
కదులుతున్న ఈ క్షణం మరలిరాదు ఏ క్షణం
తెలుసుకో క్షణాల మూట జీవితం
ఆశ పొంగినా నిరాశ మింగినా
సాగు ముందుకే నేస్తమా
డోంట్ వర్రీ డోంట్ వర్రీ
బీ హ్యాపీ బీ హ్యాపీ
నేస్తమా ఓ పూలతోటలో
అద్దాలమేడలో నీవుండగా
లోకమే నిన్ను రెచ్చగొట్టి రచ్చకీడ్చి నవ్వితే
లోకమే నిన్ను రెచ్చగొట్టి రచ్చకీడ్చి నవ్వితే
డోంట్ వర్రీ డోంట్ వర్రీ
బీ హ్యాపీ
లోకందొ వరవడి మార్చుకోదు నడవడి
ఆరనీకు గుండెలోని అలజడి
కాటువేసినా కన్నీరు కార్చకు
సాగుముందుకే నేస్తమా
డోంట్ వర్రీ బీ హ్యాపీ
బీ హ్యాపీ
నేస్తమా పదాలు నేర్చుకో
స్వరాలు కూర్చుకో
పాటందుకో
పాడుకో పదాన్ని మార్చుకో
వెలుగువవెంట సాగిపో
పాడుకో పదాన్ని మార్చుకో
వెలుగువవెంట సాగిపో
డోంట్ వర్రీ డోంట్ వర్రీ
బీ హ్యాపీ బీ హ్యాపీ బీ హ్యాపీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి