చిత్రం : ప్రేమదేశం (1996)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : భువనచంద్ర
గానం : మనో, ఉన్నికృష్ణన్, డామ్నిక్
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
కడలి ఒడిలో నదులు ఒదిగి.. నిదురపోయే వేళా..
కనుల పైన కలలే వాలి.. సోలిపోయే వేళా..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
ఆశ ఎన్నడు విడువదా..
అడగరాదని తెలియదా..
నా ప్రాణం..చెలియా నీవేలే..
విరగబూసిన వెన్నెలా..
వదిలి వేయకే నన్నిలా..
రారాదా..ఎద నీదే కాదా..
నిదురనిచ్చే జాబిలీ..
నిదురలేక.. నీవే వాడినావా..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
మంచు తెరలో అలిసిపోయి..
మధన సంధ్య తూగెనే..
పుడమి ఒడిలో కలలుకంటూ..
పాపా నీవూ నిదురపో..
మల్లె అందం మగువకెరుక..
మనసు బాధ తెలియదా..
గుండె నిండా ఊసులే..
నీ ఎదుటనుంటే మౌనమే..
జోలపాటా పాడినా..
నే నిదురలేక వాడినా..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి