చిత్రం : ఏ మాయ చేశావే (2010)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : కార్తీక్, శ్రేయా ఘోషల్
పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా
మన్నించు ప్రియా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా..
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా..
వింటున్నావా.. వింటున్నావా..
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలి సారి నీ మాటల్లో
పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ.. బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఏమో ఏమో ఏ..మవుతుందో
ఏదేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైన
వింటున్నావా ప్రియా
గాలిలో తెల్ల కాగితంలా
నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వే రాసిన
ఆ పాటలనే వింటున్నా
తరిమే వరమా..తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా..
ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భూతలం కన్నా ఇది వెనుకటిది
కాలంతోన పుట్టిందీ కాలం లా మారే
మనసే లేనిది ప్రేమ
రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా
నీ దానినై నిన్నే దారిచేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోన
ఎవరిని తలువని వేళలలోన
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా..
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలి సారి నీ మాటల్లో
పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ.. బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి