5, జులై 2021, సోమవారం

రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యాంగం పాట లిరిక్స్ - విప్లవ గీతాల సంచిక - 5 - Rajyangam Rajyangam Rajyangam Telugu Song Lyrics - Orey Rikshaw (1995) Telugu Songs Lyrics







చిత్రం : ఒరేయ్ రిక్షా(1995)
సాహిత్యం : గద్దర్
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : వందేమాతరం శ్రీనివాస్

రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యాంగం
చట్టమంటూ రంకెలేసి దూకుతావు

పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు
పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు

అరే పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు
పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు

మీ చట్టం ప్రకారమే పట్టుకున్న నేరస్థుని
పట్టుకున్న నేరస్థుని

ఇరవైనాలుగంటల్లో కోర్టు ముందు ఉంచాలి
కోర్టు ముందు ఉంచాలి

మా అన్నల మా తమ్ముల మా అక్కల మా చెల్లెల
మా అక్కల మా చెల్లెల

రోజులు నెలలు యేండ్లు చీకటి గదులల్లో పెట్టి
చీకటి గదులల్లో పెట్టి

వేళ్ళు నరికి గోళ్లు పీకి ఎమినోళ్లనే మరిపిస్తిరి
ఎమినోళ్లనే మరిపిస్తిరి

లాక్ అప్ చావులెన్ని దొంగ ఎదురు కాల్పులేన్ని
దొంగ ఎదురు కాల్పులేన్ని

ఏ చట్టం మీకిచ్చినా హక్కులివీ చెప్పరాద

పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు
పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు

మీ చట్టం మీ చట్టం మీ చట్టం ప్రకారమే
మీ చట్టం ప్రకారమే లంచం ఒక నేరమంట
లంచం ఒక నేరమంట

అరె లంచమంటే ముట్టనోరు చాలా మంచివోరు మీరు
చాలా మంచివోరు మీరు

చాలా మంచివోరు మీరు లంచమంటే ముట్టనోరు
లంచమంటే ముట్టనోరు

కానీ ఒక అనుమానం వింటనంటే విన్నపం
వింటనంటే విన్నపం

మీ ఆల్ శేషన్ కుక్కకెంత మారుతి కారుకెంత
మారుతి కారుకెంత

క్లబ్బుల్లో కాతెంత ఫారిన్ విస్కీ బుడ్డికెంత
ఫారిన్ విస్కీ బుడ్డికెంత

రంగురంగుల బిల్డింగుల రాయికెంత రంగుకెంత `
రాయికెంత రంగుకెంత

మీ జీతమెంత భత్యమెంత దానిల మిగిలేది ఎంత
దానిల మిగిలేది ఎంత

లంచం మింగని దొరో లక్షలెట్ట వచ్చినాయి

పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు
పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు

మీ చట్టం ప్రకారమే మీ చట్టం ప్రకారమే
మీ చట్టం ప్రకారమే కల్తీసారా అమ్మోద్దు
కల్తీసారా అమ్మోద్దు

యే లైసెన్సు లేకుండా సార బట్టి పెట్టొద్దు
సార బట్టి పెట్టొద్దు

అరె పట్నంలో గల్లీ గల్లీ వాసనేంది గుడుంబాది
వాసనేంది గుడుంబాది

దొరల గడిలో ఘుమ ఘుమా సార బట్టి వాసనేంది
సార బట్టి వాసనేంది

అరె దమ్ముంటే పట్టరాద రొమ్ముజరిచి దొంగ సార
రొమ్ముజరిచి దొంగ సార

నువ్వెందుకు పడతవులే నీకు కూడ వత్తుంది
నీకు కూడ వత్తుంది

అవునంటవ కాదంటవో
జనం ముందు రుజువుచేయి

పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు
పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు

పోలీసులు అంటేనే రక్షక భటులంటారు
రక్షక భటులంటారు

ఎవరిని రక్షించించుతారు మహాప్రభు సెలవివ్వుడి
మహాప్రభు సెలవివ్వుడి

పోలీసులు అంటే ఏందో అర్ధం చెబుతా వినుకో
అర్ధం చెబుతా వినుకో

కూనికోర్లు, దగాకోర్లు, వ్యభిచారులు, గజదొంగలు
వ్యభిచారులు, గజదొంగలు

వాళ్ళందరి వత్తాసు పలికేటి దొరలు మీరు
పలికేటి దొరలు మీరు

సాక్ష్యం నీకు కావాలంటే
సత్యం నీకు కావాలంటే
సత్యం నీకు కావాలంటే

అరె రోడ్డు మీద రిక్షనడుగు
పోలీస్ స్టేషన్ బోర్డునడుగు
పోలీస్ స్టేషన్ బోర్డునడుగు

జైళ్ల ఉన్న ఖైదీనడుగు లంచగొండి సాక్షినడుగు
లంచగొండి సాక్షినడుగు

సారబట్టి కూలినడుగు కల్తీసార బుడ్డినడుగు
కల్తీసార బుడ్డినడుగు

చెరచ బడ్డ చెల్లినడుగు తిరగబడ్డ రైతునడుగు
తిరగబడ్డ రైతునడుగు

ఆడుకునే పాపనడుగు అమరజీవి తల్లినడుగు
అమరజీవి తల్లినడుగు

ఉరితీసిన తాడునడుగు వీరుని కనుగుడ్లనడుగు
వీరుని కనుగుడ్లనడుగు

నీ భుజంకు వేలాడుతున్న తుపాకీ తూటాలనడుగు

పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు
పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు

రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి
కళ్ళు తెరిచి చూసుకోండి

మనిషికి జీవించే హక్కు మనిషికి మాటాడే హక్కు
మనిషికి మాటాడే హక్కు

భాష హక్కు మతం హక్కు హక్కు
పత్రికల్లో ప్రకటనక్కు
పత్రికల్లో ప్రకటనక్కు

పేపరుమీదున్నక్కులు ప్రజలకు దక్కాలంటే
ప్రజలకు దక్కాలంటే

మీరిస్తమన్న హక్కడిగితే రెచ్చిపోయి పిచ్చిలేచి
రెచ్చిపోయి పిచ్చిలేచి

పిట్టలను కాల్చినట్టు ప్రజల కాల్చి చంపుతాన్రు
ప్రజల కాల్చి చంపుతాన్రు

ఇది యే చట్టం యే క్లాజో యే సెక్షణో చెప్పరాద

పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు
పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు

పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు
పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి