చిత్రం : రిపబ్లిక్ (2021)
సాహిత్యం : రహ్మాన్
సంగీతం : మణిశర్మ
గానం : అనురాగ్ కులకర్ణి, ధనుంజయ్,
హైమత్ మొహమ్మెద్, ఆదిత్య అయ్యంగార్, పృథ్వి చంద్ర
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రో
నా ప్రాణంలోని ప్రాణం
నా దేహంలోని దాహం
నా మౌనం పాడే గానం
నా ప్రశ్న సమాధానం
అది అందమైన అందరాని కన్నెరా
లక్ష అక్షరాలూ రాయలేని కవితరా
ఈ ప్రపంచమే కోరుకునే అతివరా
పెనువిప్లవాల విశ్వకన్య స్వేచ్ఛరా
నా కళ్ళలోన రంగుల కలరా
నా కళ్ళలోన రంగుల కలరా
నా ఊహలకే ఉనికే తనురా
నా బతుకులోన భాగం కదరా
నా ఊపిరికే అర్థం తనురా
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రో
తెల్లవాడినెదిరించి నల్లని చీకట్లనుంచి
పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే
అంతలోనే తెలిసిందది మాయమైపోయిందని
ముందుకన్నా ముప్పు ఉన్న పంజరాన ఉన్నదని
అసలెక్కడుందో తెలియకుంది చూడరా
అది లేక మనిషికింకా విలువేదిరా
ఏ పోరాటంతో దానిని చేరాలిరా
ఏ ఆయుధంతో దానిని గెలవాలిరా
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రో
అనాదిగా ఎవడో ఒకడు అది నాకు సొంతమంటూ
నియంతలై నిరంతరం చెరలో బంధించినారు
రెక్కలనే విరిచేసి హక్కులని చెరిపేసి
అడిగే ప్రతిఒక్కరిని అణిచి అణిచివేసినారు
నరజాతి చరిత్రలో నలిగిపోయెరా
చల్లారని స్వాతంత్రకాంక్ష స్వేచ్ఛరా
నరనరాల్లోన ప్రవహించే ఆర్తీరా
కనిపించగానే నడిపించే కాంతిరా
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి