చిత్రం : సఖి (2000)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : హరిహరన్, క్లింటన్
సఖియా చెలియా కౌగిలి
కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా చెలియా నీ ఒంపె
సొంపె తొణికిన తొలి పండు
పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపె పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
యదకు సమ్మతం చెలిమె
పచ్చందనమే పచ్చదనమే
ఎదిగె పరువం పచ్చదనమె
నీ చిరునవ్వు పచ్చదనమే
యదకు సమ్మతం చెలిమే
యదకు సమ్మతం చెలిమే
యదకు సమ్మతం చెలిమే
కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు
ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా
పూత గులాబి పసి పాదం
ఎర్రాని రూపం ఉడికే కొపం
ఎర్రాని రూపం ఉడికే కోపం
సంధ్యావర్ణ మంత్రాలు వింటె
ఎర్రని పంట పాదమంటె
కాంచనాల జిలుగు పచ్చ
కొండ బంతి గొరంత పచ్చ
పచ్చ పచ్చ పచ్చా
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం
సఖియా చెలియా కౌగిలి
కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా చెలియా నీ ఒంపె
సొంపె తొణికిన తొలి పండు
అలలే లేని సాగర వర్ణం
మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం
గుమ్మాడి పూవ్వు తొలి వర్ణం
ఊదా పూరెక్కల పై వర్ణం
ఎన్నో చేరెనీ కన్నె గగనం
నన్నె చేరె ఈ కన్నె భువనం
రాత్రీ నలుపే రంగు నలుపే
వానా కాలం మొత్తం నలుపే
కాకీ రెక్కల్లొ కారు నలుపే
కన్నె కాటుక కళ్ళు నలుపే
విసిగీ పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
సఖియా చెలియా కౌగిలి
కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియ చెలియ నీ ఒంపె
సొంపె తొణికిన తొలి పండు
తెల్లని తెలుపే యద తెలిపే
వానలు కడిగిన తుమ్మి తెలుపే
తెల్లని తెలుపే యద తెలిపే
వానలు కడిగిన తుమ్మి తెలుపే
ఇరు కనుపాపల కథ తెలిపే
ఉన్న మనసు తెలిపే
ఉడుకు మనసు తెలిపే
ఉరుకు మనసు తెలిపే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి