ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : మూగ మనసులు (2013)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : కేశవ కిరణ్
గానం : కారుణ్య
తెలుసే తెలుసే నువు నా ఎదురుగా లేవు
తెలుసే తెలుసే ఇక నా వైపుకే రావు
తెలిసే తెలిసే మళ్లీ నిన్ను కోరాను
తెలిసే తెలిసే నీకై వెతుకుతున్నాను
ప్రియరాల అర్దం కాలేదా
దయ లేదా కొంచెం నా మీద .....
లోకంలో నాకన్నా నిన్ను ప్రేమించే
వాడ్ని చూపిస్తే చాలు ......
ఆ రోజే నీ నుండి నేను దూరం అవుతాను
బ్రతికున్నన్నాళ్లు .....
నీతో నేను వేరయ్యానంటు కోపంగా
నీలాకాశం నల్లంగా మారిందే
నువ్వే నన్ను వదిలావంటు ఆవేశంగా
మేఘం కూడా నిప్పుల్నే చల్లిందే
నువ్వు నేను సరదాగా తిరిగిన
ప్రతి చోటు నన్నే చూసి
మోహమే చాటేస్తుంటే ....
నువ్వి చోట నాకై మిగిలుంచిన
ప్రతి గురుతు నాలో ఉంటు
నన్నే తొలిచేస్తుందే
లోకంలో నాకన్నా నిన్ను ప్రేమించే
వాడ్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీ నుండి నేను దూరం అవుతాను
బ్రతికున్నన్నాళ్లు
ఒకటయ్యాక ఒంటరిగా ఉంటే ఆ ప్రాణం
శూన్యంతోనే సావాసం చేస్తుందే
ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం
ఉన్నట్టుండి తన సవ్వడి ఆపిందే
ఏదో రోజు నువు వస్తావన్నా ఈ ఆశే
శ్వాసై నన్ను బ్రతికిస్తునే ఉందే
మళ్లీ జన్మ అసలుందో లేదో ఏమోలే
ఇపుడి ఈ జన్మ నువు కావాలంటుందే
లోకంలో నాకన్నా నిన్ను ప్రేమించే
వాడ్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీ నుండి నేను దూరం అవుతాను
బ్రతికున్నన్నాళ్లు
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : కేశవ కిరణ్
గానం : కారుణ్య
తెలుసే తెలుసే నువు నా ఎదురుగా లేవు
తెలుసే తెలుసే ఇక నా వైపుకే రావు
తెలిసే తెలిసే మళ్లీ నిన్ను కోరాను
తెలిసే తెలిసే నీకై వెతుకుతున్నాను
ప్రియరాల అర్దం కాలేదా
దయ లేదా కొంచెం నా మీద .....
లోకంలో నాకన్నా నిన్ను ప్రేమించే
వాడ్ని చూపిస్తే చాలు ......
ఆ రోజే నీ నుండి నేను దూరం అవుతాను
బ్రతికున్నన్నాళ్లు .....
నీతో నేను వేరయ్యానంటు కోపంగా
నీలాకాశం నల్లంగా మారిందే
నువ్వే నన్ను వదిలావంటు ఆవేశంగా
మేఘం కూడా నిప్పుల్నే చల్లిందే
నువ్వు నేను సరదాగా తిరిగిన
ప్రతి చోటు నన్నే చూసి
మోహమే చాటేస్తుంటే ....
నువ్వి చోట నాకై మిగిలుంచిన
ప్రతి గురుతు నాలో ఉంటు
నన్నే తొలిచేస్తుందే
లోకంలో నాకన్నా నిన్ను ప్రేమించే
వాడ్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీ నుండి నేను దూరం అవుతాను
బ్రతికున్నన్నాళ్లు
ఒకటయ్యాక ఒంటరిగా ఉంటే ఆ ప్రాణం
శూన్యంతోనే సావాసం చేస్తుందే
ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం
ఉన్నట్టుండి తన సవ్వడి ఆపిందే
ఏదో రోజు నువు వస్తావన్నా ఈ ఆశే
శ్వాసై నన్ను బ్రతికిస్తునే ఉందే
మళ్లీ జన్మ అసలుందో లేదో ఏమోలే
ఇపుడి ఈ జన్మ నువు కావాలంటుందే
లోకంలో నాకన్నా నిన్ను ప్రేమించే
వాడ్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీ నుండి నేను దూరం అవుతాను
బ్రతికున్నన్నాళ్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి