చిత్రం : ఆర్య (2004)
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
సంగీతం : దేవీశ్రీప్రసాద్
గానం : టిప్పు
హేయ్ తకదిమి తోం తకదిమి తోం
తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకు తకదిమి తోం
తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని
తకదిమి తోం ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం
కష్టం నష్టం ఎదురైనా నచ్చినదె చేసేద్దాం
అలవాటైతే చేదైనా తకదిమి తోం
తప్పో ఓప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా తకదిమి తోం
కృషి ఉంటే నీవేంటేరా ఈ లోకం
గాయేంగే జోష్ కెలియే
జీయేంగే
ప్యార్ కేలియే
హేయ్ తకదిమి తోం తకదిమి తోం
తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకు తకదిమి తోం
తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని
తకదిమి తోం ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం
చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని
తరిమేయ్యరా ఆ ఓర్పుకి తకదిమి తోం
ఉల్లాసమే ఓ వెల్లువలా ఓ ఉప్పెనలా
ఉరకాలిరా ఆ జోరుకి తకదిమి తోం
పరిగెడదాం పరిగెడదాం
గెలిచేవరకు పరిగెడదాం
గురిచూసాక మనకింకా తిరుగేది
గాయేంగే జోష్ కెలియే
హేయ్ తకదిమి తోం తకదిమి తోం
తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకు తకదిమి తోం
నీ మాటతో అటు నిశ్శబ్దం ఇటు ఓ యుద్ధం
ఆగాలిరా ఆ నేర్పుకు తకదిమి తోం
నీ ప్రేమతో ఆ శత్రువునే ఓ మిత్రునిగా మార్చాలిరా
ఆ గెలుపుకి తకదిమి తోం
ఒకటవుదాం ఒకటవుదాం
ప్రేమను పంచగ ఒకటవుదాం
ప్రేమించే మనసుంటే మహరాజే
జీయేంగే
ప్యార్ కేలియే
హేయ్ తకదిమి తోం తకదిమి తోం
తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకు తకదిమి తోం
తకదిమి తోం
కష్టం నష్టం ఎదురైనా నచ్చినదె చేసేద్దాం
అలవాటైతే చేదైనా తకదిమి తోం
కృషి ఉంటే నీవేంటేరా ఈ లోకం
గాయేంగే జోష్ కెలియే
జీయేంగే
ప్యార్ కేలియే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి