చిత్రం : ఆచార్య (2022)
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : మణిశర్మ
గానం : రేవంత్, గీతా మాధురి
కల్లోలం కల్లోలం ఊరూవాడా
కల్లోలం నేనొస్తే అల్లకల్లోలం
కల్లోలం కల్లోలం కిందా మీదా
కల్లోలం నా అందం అల్లకల్లోలం
నా జడగంటలు ఊగేకొద్దీ
ఓ అరగంటలో పెరిగే రద్దీ
ధగధగల వయ్యారాన్ని దాచిపెట్టేదెట్టాగా
సానా కష్టం సానా కష్టం
సానా కష్టం వచ్చిందే మందాకినీ
చూసేవాళ్ల కళ్ళు కాకులెత్తుకుపోని
సానా కష్టం వచ్చిందే మందాకినీ
నీ నడుం మడతలోన జనం నలిగేపోనీ
నా కొలతే చూడాలని
ప్రతోడు టైలర్ లా అయిపోతాడే
ఓ నిజంగా భలే బాగున్నాదే
నీ మూలంగా ఒక పనిదొరికిందే
యాడేడో నిమరోచ్చని
కుర్రాళ్లే ఆర్ఎంపీలవుతున్నారే
ఏ ఇదేదో కొంచెం తేడాగుందే
నీ అబద్ధం కూడ అందంగుందే
ఇల్లు దాటితే ఇబ్బందే ఒంపుసొంపుల్తో
సానా కష్టం పాపం సానా కష్టం
సానా కష్టం వచ్చిందే మందాకినీ
అంటించకే అందాల అగరొత్తిని
సానా కష్టం వచ్చిందే మందాకినీ
నానమ్మతో తీయించేయ్ నరదిష్టినీ
నా పైట పిన్నీసుని అదేంటో విలన్ లా
చూస్తుంటారే
ఏ లెవెల్లో ఫోజెడుతున్నావే
మా చెవుల్లో పూలెడుతున్నావే
డాబాలే ఎక్కేస్తారే పెరట్లో
మాయమ్మే నలుగెడుతుంటే
నీ కహాని మాకెందుకు చెప్పు
మేం వింటున్నాం అని కొట్టకే డప్పు
గంపగుత్తుగా సోకుల్తో ఎట్టా వేగాలో
సానా కష్టం అరెరే సానా కష్టం
సానా కష్టం వచ్చిందే మందాకినీ
పంచాయితీలెట్టొద్దే వద్దొద్దనీ
సానా కష్టం వచ్చిందే మందాకినీ
అచ్చుబొమ్మ ఆటాడించు యావత్తునీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి