చిత్రం : చిత్తం మహారాణి (2022)
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
సంగీతం : గౌర హరి
గానం : రామ్ మిర్యాల
ఓ .. ఓ .. ఓ …
కోల కోల కోల
కోలకళ్ళ సిన్నదీ
గోల గోల గోల
చేసి చంపుతున్నది
అరే ఏటవాలు సూపుతోనే
గాలమేస్తది …
ఎద తారుమారు చేసి
జూదమాడుతున్నది ......
గుట్టే … దాచిపెట్టుకుందిరో …
గట్టే … దాటనీయకుందిరో ….
కేడిరో ….
గుట్టే … దాచిపెట్టుకుందిరో …
గట్టే … దాటనీయకుందిరో …
ఓ క్షణం హుషారుగుంటది
ఓ క్షణం పరాకుగా
గంటలో తుఫాను మాదిరి
మారిన ప్రశాంతతా
కోల కోల కోల
కోలకళ్ళ సిన్నదీ
గోల గోల గోల
చేసి చంపుతున్నది …
మంచులాగ ఉంటు మంటారేపినా
కోర పళ్ళు లేని ఆడ దెయ్యమా
పూలదారికూడా నువ్వు కాలు
పెట్టగానే మారిపోద ముళ్ళదారిగా
రాతిరేల చేరి జోలపాటలాగ
జిల్లాకొట్టి లేపే పీడస్వప్నమా
కంచు కంఠమెత్తి గోల గోల చేసినా
హాయిగానే ఉందిగా
ఇంత దారుణంగా
నన్ను ఆడుకుంటు ఉన్నా
ఇష్టమెందుకంటే ఎలాగా చెప్పడం
కాళిదాసుకూడా కంప్యారిసన్లు లేకా
ఆ పెన్ను పక్కనెట్టి
బుక్కు మూసి దండమేంటిపోడా
స్ట్రాబెర్రీ పెదాల సుందరి
రాబరీ చేసిందిరో
పోకిరి గుణాల వైఖరీ
ఊపిరే లాగిందిరో
కోల కోల కోల
కోలకళ్ళ సిన్నదీ
గోల గోల గోల
చేసి చంపుతున్నది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి