31, జనవరి 2022, సోమవారం

కలయిక ఓ మాయ పరిచయమో మాయ పాట లిరిక్స్ - Kalayika O Maaya Parichayamemo Song Lyrics in Telugu - A (Ad Infinitum) (2021) Telugu Songs Lyrics






చిత్రం : A (AD INFINITUM) (2021)

సంగీతం : విజయ్ కూరాకుల  

సాహిత్యం : అనంత శ్రీరామ్  

గానం : దీపు, పావని


 

కలయిక ఓ మాయ పరిచయమో మాయ

కలిసిన చేతుల్లో పరవశమో మాయ

పెరిగే స్నేహంలో పరిమళమో మాయ

పంచిన ప్రాణంలో పరితపమో మాయ

 

కలయిక ఓ మాయ పరిచయమో మాయ

కలిసిన చేతుల్లో పరవశమో మాయ

పెరిగే స్నేహంలో పరిమళమో మాయ

పంచిన ప్రాణంలో పరితపమో మాయ

 

గడిచే కాలంలో ఓ ఓ ఓఓ ఓఓ

గడిచే కాలంలో గతమంటే ఓ మాయ

నిలిచేటి బంధంలో నిమిషానికో మాయ

 

కలయిక ఓ మాయ పరిచయమో మాయ

కలిసిన చేతుల్లో పరవశమో మాయ

 

ఏ మై నా ఈపైన

అడుగులు నీతోనే అలసట నీతోనే

హా యై నా బాధైనా

చెరిసగమౌతానే బ్రతుకిక నీతోనే

జతలో సాగించే ఓ ఓ ఓఓ ఓఓ

జతలో సాగించే సరదా ఓ మాయ

సరదాలో పంచే సరసం ఓ మాయ

ఒకరా ఇద్దరమా అనిపించే మాయ

ఒకరే ముగ్గురుగా కనిపించే మాయ

 

కలయిక ఓ మాయ పరిచయమో మాయ

కలిసిన చేతుల్లో పరవశమో మాయ

 

లో లో చాలా ఉన్న

బయటికి మాటల్లో తెలియదు కొంతైనా

నా లో ఏ ప్రశ్నైనా

ఎదురుగ నీ ప్రేమ బదులుగ నిలిచేనా

అనురాగం చేసే ఓ ఓ ఓఓ ఓఓ

అనురాగం చేసే అల్లరి ఓ మాయ

మమకారం వేసే మంత్రం ఓ మాయ

కలలో వెంటాడే కలవరమో మాయ

నిజమై వెంటుండే నీ పలుకే మాయ

 

కలయిక ఓ మాయ పరిచయమో మాయ

కలిసిన చేతుల్లో పరవశమో మాయ

 


 

30, జనవరి 2022, ఆదివారం

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది పాట లిరిక్స్ - Ee Reyi Theeyanidhi Ee Chirugaali Manasainadhi Song Lyrics in Telugu - Johnny (2003) Telugu Songs Lyrics
















చిత్రం : జానీ (2003)
సంగీతం : రమణ గోగుల 
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : హరిహరన్, నందిత




ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి


ఓ వరములా దొరికె నీ పరిచయం 
నా మనసులో కురిసెనే అమృతం 
నా నిలువునా అలలయే పరవశం 
నీ చెలిమికే చేయని అంకితం 
కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం 

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి

నీ ఊపిరే వెచ్చగా తగలని 
నా నుదుటిపై తిలకమై వెలగని 
నా చూపులే చల్లగా తాకని 
నీ పెదవిపై నవ్వుగా నిలవని 
ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది 
ఇంతకు మించి ఏమున్నది
ఇంతకు మించి ఏమున్నది




ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ పాట లిరిక్స్ - Ennenno Janmala Bandham Needhi Naadhi Song Lyrics in Telugu - Pooja (1975) Telugu Songs Lyrics















చిత్రం : పూజ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : దాశరథి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం





ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి
నిన్నే చూసిన వేళా నిండును చెలిమి
ఓహో హో హో ..నువ్వు కడలివైతే
నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను
చేరనా. చేరనా.. చేరనా...
 
 
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

విరిసిన కుసుమము నీవై మురిపించేవు
తావిని నేనై నిన్నూ పెనవేసేను
ఓహో హో హో మేఘము నీవై నెమలిని నేనై
ఆశతో నిన్ను చూసి చూసి
ఆడనా.. ఆడనా.. ఆడనా...
  
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

కోటి జన్మలకైనా కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ .. నేనుండాలి
ఓహో హో హో నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్ల వేళలందు
ఉండనీ. ఉండనీ.. ఉండనీ..

ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఆఅహాహహహాఅ..ఓహోహోహొహో..


కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట పాట లిరిక్స్ - Konthakaalam Kindhata Brahma Devuni Mungita Song Lyrics in Telugu - Nee Sneham (2002) Telugu Songs Lyrics













చిత్రం : నీస్నేహం (2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్  
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఆర్.పి.పట్నాయక్, రాజేశ్




కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం

కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్ను నన్నూ చూడగానే నమ్మితీరాలి

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

బొమ్మా బొరుసులేని నాణానికి విలువుంటుందా 
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలీ నీ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదరించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలీ ఈ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం

కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్ను నన్నూ చూడగానే నమ్మితీరాలి 



అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద పాట లిరిక్స్ - Andaala Chinni Devatha Aalayame Chesi Song Lyrics in Telugu - Sivaramaraju (2002) Telugu Songs Lyrics
















చిత్రం : శివరామరాజు (2002)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్  
సాహిత్యం : విజయ్ చిర్రావూరి
గానం : శంకర్ మహదేవన్, సుజాత  





సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

పూవులెన్నొ పూచే నువ్వు నవ్వగానే
ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే
నీడపడితే బీడు పండాలి
అడుగు పెడితే సిరులు పొంగాలి
కల్మషాలు లేని కోవెలంటి ఇల్లుమాది
స్వచ్చమైన ప్రేమే పందిరల్లె అల్లుకుంది
స్వార్ధమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి
వెన్నకన్న మెత్తనైన గంగకన్న స్వచ్ఛమైన
ప్రేమబంధమంటె మాదిలే

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

హే స్వాతిముత్యమల్లే పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి
నలక పడితే కంటిలో నీకు
కలత పెరుగు గుండెలో మాకు
అమృతాన్ని మించే మమత మాకు తోడువుంది
మాట మీద నిలిచే అన్న మనసు అండవుంది
రాముడెరుగలేని ధర్మమీడ నిలిచివుంది
కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది
నేల మీద ఎక్కడైన కానరాని సాటిలేని
ఐకమత్యమంటే మాదిలే

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
 
శ్రీ లక్ష్మీ దేవి రూపము శ్రీ గౌరి దేవి తేజము
కలిసీ మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటిదేవతై
సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణమే ఇక
దొరికింది సిరుల కానుకా గతజన్మల పుణ్యఫలముగా
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు 


గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం పాట లిరిక్స్ - Guppedantha Gundello Cheppaleni Aanandham Song Lyrics in Telugu - Santhosham (2002) Telugu Songs Lyrics















చిత్రం : సంతోషం (2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్   
సాహిత్యం : కులశేఖర్  
గానం : శంకర్ మహదేవన్   



ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం
గుప్పెడంత గుండెల్లో
చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో
గడిపేయడమే కదా ఆనందం
అందరం మనమందరం
కలిసుంటేనే కదా సంతోషం

ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం

అమ్మాయిల చేతలకీ కుర్రాళ్ల
కూతలకీ హద్దంటూ
లేదయ్యో ఈ దినం
సందట్లో సందయ్యో పెళ్లవనీ
జంటలకీ ఆనందం
అందించే ఈ క్షణం
పేకాట రాయళ్ల చేజోరు చూడాలి
ఈ పెళ్లి లోగిళ్లలో
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు
కుర్రాళ్లు విడిదింటిలో
కన్నెపిల్లలకు బ్రహ్మచారులకు
కొంటెసైగలే ఇష్టమంట

ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం
గుప్పెడంత గుండెల్లో
చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం

ఈ పెళ్లిపందిరిలో సరదాల సందడిలో
ఈ నేలకొచ్చిందయ్యో అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా
ఈ ఇంట జరగాలయ్యో సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు
చేరేది ఈ వేళలో
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి
ఈ వేదమంత్రాలలో
కన్యదాతకి అప్పగింతలూ
కంటితుడుపులూ తప్పవంట

ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం
గుప్పెడంత గుండెల్లో
చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో
గడిపేయడమే కదా ఆనందం
అందరం మనమందరం
కలిసుంటేనే కదా సంతోషం

ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం 




కిలకిలమను కలికి చిలక వల్లోకి రాక పాట లిరిక్స్ - Kilakilamanu Kaliki Chilaka Valloki Raaka Song Lyrics in Telugu - Hanumaan Junction (2001) Telugu Songs Lyrics














చిత్రం : హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం : సురేష్ పీటర్స్   
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : మనో, ఎం.జి.శ్రీకుమార్, చిత్ర, సుజాత 




తేనెపట్టును పట్టబోతే 
దొంగ తేలు కుట్టిందంటే 
గోలుమాలు.. 
చక్కని చుక్కని పట్టబోయి 
లెక్కే లేక చిక్కే పడితే 
గోలుమాలు...... 
ఆఆఆ.... హొయ్... 

కిలకిలమను కలికి చిలక వల్లోకి రాక 
తన వలపుల వలన పడక కల్లోకి రాక 
మనసు పడిన వాడితో జత విడిచిన అలజడి
ఓ గోలుమాలు... ఆ... గోలుమాలు
చెదిరిన తొలి ఆశలు చెరిగిన చెలి బాసలూ 
మ గోలుమాలు ఆహా గోలుమాలు  
హే రాజా గోలుమాలు గోలుమాలు 

అమ్మాడి గుమ్మాడి ఆషాడం అల్లాడి 
వేటాడి వెంటాడి వేరు పడే నీ జోడి 
హనుమాను జంక్షన్లో హనీమూన్ ఫంక్షన్ లో 
జంబలకిడి రంభకు ముడిపడ్డావంటే 
గోలుమాలు హోఓఓఓఓఓఓ ... 
గోలుమాలు ఒఒఒఒఒఒఒఒఒ ...... 
గోలుమాలు హే..... 

కిలకిలమను కలికి చిలక వల్లోకి రాక 
తన వలపుల వలన పడక కల్లోకి రాక 
మనసు పడిన వాడితో జత విడిచిన అలజడి
ఓ గోలుమాలు... ఆ... గోలుమాలు
చెదిరిన తొలి ఆశలు చెరిగిన చెలి బాసలూ 
యమ గోలుమాలు.. గోలుమాలు 
హే రాజా గోలుమాలు గోలుమాలు 

శివుడి ధనుస్సు తుస్సు మనంగా 
సీతకు రాముడు కిస్సు అనంగా 
గజిబిజిమేళం గందరగోళం 
రాధా కృష్ణులు ప్లస్సు అవంగా 
భామే పామై బుస్సుమనంగా 
రుక్మిణి వేసెను కృష్ణుడి తాళం 
కుర్రదంటే కుంపటేనోయ్ 
గుత్తివంకాయ కూర కానేకాదోయ్ 
అంతే లేవోయ్ 
కాళ్ళ గజ్జా గంగాళమ్మ 
వేగుల చుక్క వెలగ మొగ్గ 
వెన్నెల్లో గొడుగంటిది ప్రేమ 
వీరి వీరి గుమ్మడిపండు 
విచ్చెను జాజి మల్లెల చెండు 
మబ్బుల్లో నీళ్లంటిది ప్రేమ 

గోలుమాలు రాజా గోలుమాలు 
 గోలుమాలు రాజా

పడుచుతనపు పరికిణికె పాదాలు ఆడా 
కళలు పండే కలయికలై కళ్యాణి పాడా 
ఎవరికెవరు సొంతమో 
వివరమసలు తెలియని 
ఈ గోలుమాలు గోలుమాలు 
మదనుడికే ఇది పండగ 
మతిచెడి నేనుండగా గోలుమాలు 
గోలుమాలు హే రాజా గోలుమాలు
 
జారు పైటలే జావళీలుగా 
చీర పాపలే చిందులేయగా 
కోరికలన్ని కొక్కొరోకోలంట 
అబల సోకులా జబర్దస్తీ లో 
తబలా గుండెలు తాళమేయ గా 
ఇద్దరి ప్రేమకు ముద్దుల దరువంట 
గోలుమాలు రాజా గోలుమాలు రాజా 
గోలుమాలు రాజా గోలుమాలు...



గ్రీకువీరుడు నా రాకుమారుడు కలల్లోనే ఇంకా ఉన్నాడు పాట లిరిక్స్ - Greekuveerudu Naa Raakumaarudu Song Lyrics in Telugu - Ninne Pelladatha (1996) Telugu Songs Lyrics
















చిత్రం : నిన్నేపెళ్లాడతా (1996)
సంగీతం : సందీప్‌ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల   సీతారామశాస్త్రి
గానం : సౌమ్య




గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు నా రాకుమారుడు 
కలల్లోనే ఇంకా ఉన్నాడు
ఫిలింస్టారులు క్రికెట్టు వీరులు 
కళ్లుకుట్టి చూసే కుర్రాడు 
డ్రీమ్‌బాయ్
రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు 
డ్రీమ్‌బాయ్
ఊరని పేరని జాడనే చెప్పడు
ఏమి చెప్పను ఎలాగ చెప్పను 
ఎంత గొప్పవాడే నా వాడు
రెప్పమూసినా ఎటేపు చూసినా 
కళ్లముందు వాడే ఉన్నాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎవ్వరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...

నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నబోదా
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా
స్టైల్‌లో వాడంత వాడు లేడు
నన్ను కోరిన మగాళ్లు ఎవ్వరు 
నాకు నచ్చలేదే వాట్ టు డూ
నేను కోరిన ఏకైక పురుషుడు 
ఇక్కడే ఎక్కడో ఉన్నాడు

ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎందుకో ఆకలి నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...

లోకమంతా ఏకమైనా లెక్కచేయనన్న వాడు
కోరుకున్న ఆడపిల్ల కళ్లముందు నిలవలేడు
చూస్తా ఎన్నాళ్లు దాగుతాడు
కన్నె ఊహలో ఉయ్యాలలూగుతూ 
ఎంత అల్లరైనా చేస్తాడు
ఉన్నపాటుగా కొరుక్కు తిననుగా 
ఎందుకంత దూరం ఉంటాడు

ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎవ్వరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...

అయ్యగారు అవునండీ భలె మంచివారు అవునండీ పాట లిరిక్స్ - Ayyagaaru Avunandi Bhalemanchivaaru Avunandi Song Lyrics in Telugu - Sneham Kosam (1999) Telugu Songs Lyrics
















చిత్రం : స్నేహంకోసం (1999)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : ఏ.ఎం.రత్నం
గానం : మనో, జయచంద్రన్  




సంపేత్తాను నిన్ను 
ఎదురు తిరిగి మాటాడావంటె 
ఏరా ఆడు చేసింది తప్పే కదూ 
అవును అవును పెద్దయ్యా 

హా అవును కొబ్బరి చెట్టుకు
 చేసిన ముచ్చటా 
మన అమ్మాయికి చేస్తే 
తప్పేంటి చెప్పండిరా 
అవును అవును చిన్నయ్యా 

రేయ్ ఆగరా...ఆగనండి 
ఆగమంటుంటె...ఆగనండీ 
ఒరేయ్ ఒరే ఒరేయ్... అయ్యా 
ఉత్తినే నాటకమాడాను 

ఒరేయ్ తెలివితక్కువ దద్దమ్మ 
ప్రేమ మటుకు ఉంటె చాలదు 
కూసంత రోషం కూడ ఉండాలి 
ఏమైన నువ్వు ఆ ఇంటికి 
వెళ్ళడం తప్పు తప్పే 
అవును అవును పెద్దయ్యా 

ఊర్లో అందరికి అన్ని చేస్తారు 
అసలు మన ఇంటి ఆడ పడుచు 
కంట తడి పెట్టుకుంటె మంచిదేంటి 
ప్రేమకన్నా రోషం గొప్పదా...చెప్పండ్రా 
అవును అవును చిన్నయ్యా 

అయ్యగారు...అవునండీ 
భలె మంచివారు...అవునండీ 
మరి కోపమొస్తే...అవునండీ 
భలె రోషగాడు...అవునండీ 
మాయదారి రక్తపోటు అది చేసే పొరపాటు 
మాయదారి రక్తపోటు అది చేసే పొరపాటు 

అయ్యగారి మాటంటె తలకట్టు మాట 
కాదంటె ఆ పూట తందనాల పాట 
చిన్నయ్య మాటంటె చిక్కులేని మాటా 
వినకుంటె ఆ పూట తైతక్కలాటా 
రోషమున్నా వంశమురా నువ్వు కాకా పట్టకురా 
రోషమున్నా వంశమురా నువ్వు కాకా పట్టకురా 

మాట వినక పోతె చంపేస్తా 
నా తుపాకితో నిను కాల్చేస్తా 
అవునండీ అది చెయ్యండీ 
కాల్చడం వల్ల కాదండీ 
తుపాకిలో గుళ్ళు లేవండీ 
అవునండీ అది నిజమండీ 
నూరు ఆరయిన రేయి పగలైన 
నేను మారేది లేదూ 
రోషమే లేని పౌరుషం లేని 
మీసమే ఎందుకంటా 

అయ్యయ్యో పెద్దయ్యా 
ఈ పంతాలేలయ్యా 
కోపాలే ఇంటికి ఒంటికి 
మంచిది కాదయ్యా 

అయ్యగారు...అవునండీ 
భలె మంచివారు...అవునండీ 
మరి కోపమొస్తే...అవునండీ 
భలె రోషగాడు...అవునండీ 

ఏవండొయ్ కొంచం ఆగండీ 
తువ్వాలు నడుమున కట్టండీ 
అవుండీ అది చెయ్యండీ 
వాడి మాటలు మీకేలండీ 
తేడాలిక్కడ లేనె లేవండీ 
అవునండీ అది నిజమండీ 
పెద్దవారినే గౌరవించడం 
మీరు నేర్పినది కాదా 
చిన్న వాడినే మంచి మనసుతో 
మీరు మన్నించ లేరా 
దారి కొచ్చాడు...

ఓరయ్యో చిన్నయ్యా 
మనసెరిగిన వాడివయా 
మీసాన్నే మెలివేసి 
మన కీర్తిని పెంచవయా 

అయ్యగారు...అవునండీ 
భలె మంచివారు...అవునండీ 
మరి కోపమొస్తే...అవునండీ 
భలె రోషగాడు...అవునండీ 
మాయదారి రక్తపోటు అది పోనే పోయిందీ 
మాయదారి రక్తపోటు అది పోనే పోయిందీ 

ఎడ్డెమంటె తెడ్డెమంటు వెర్రెక్కి పోయే 
అయ్యగారి కోపమంత కొండెక్కి పోయే 
వానొచ్చి వరదొచ్చి చల్లారి పోయే 
చిన్నయ్య మనసంత సంతోషమాయే 
రోషమున్నా వంశమురా 
రారాజుగ బతికెయ్ రా 
రోషమున్నా వంశమురా 
రారాజుగ బతికెయ్ రా




కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం పాట లిరిక్స్ - Kalisunte Kaladhu Sukham Kammani Samsaaram Song Lyrics in Telugu - Kalisundhaam Raa (2000) Telugu Songs Lyrics

















చిత్రం : కలిసుందాంరా (2000)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : రాజేష్ 




ధీంతన ధీంతన దిరనననా 
దిరనదిరననానా 
ధీంతన ధీంతన దిరనననా 
దిరనదిరననానా 
 
కలిసుంటే కలదు సుఖం 
కమ్మని సంసారం 
అవుతుంటే కలలు నిజం 
ప్రేమకు పేరంటం 
గుమ్మడి పువ్వుల నవ్వులతో 
గుమ్మం ఎదురు చూసే 
కుంకుమపువ్వుల మిలమిలతో 
ఇంద్రధనుసు విరిసే 
వస్తారా మా ఇంటికి 
ప్రతిరోజూ సంక్రాంతికి 

గుమ్మడి పువ్వుల నవ్వులతో 
గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో 
ఇంద్రధనుసు విరిసే

ఖుషీ తోటలో 
గులాబీలు పూయిస్తుంటే 
హలో ఆమని చలో ప్రేమని 
వసంతాలిలా ప్రతిరోజు 
వస్తూ వుంటే 
చలి కేకల చెలే కోకిల 
నవ్వులనే పువ్వులతో 
నిండిన ప్రేమవనం 
వెన్నెలలే వెల్లువలై 
పొంగిన సంతోషం 
ప్రేమలన్నీ ఒకసారే 
పెనేశాయి మా ఇంట 

గుమ్మడి పువ్వుల నవ్వులతో 
గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో 
ఇంద్రధనుసు విరిసే 
కలిసుంటే కలదు సుఖం 
కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం 
ప్రేమకు పేరంటం

ఒకే ఈడుగా ఎదే జోడు 
కడుతూవుంటే 
అదే ముచ్చట కథేముందటా 
తరం మారినా స్వరం మారనీ
ప్రేమ సరాగానికే వరం అయినది 
పాటలకే అందనిది పడుచుల పల్లవిలే 
చాటులలో మాటులలో సాగిన అల్లరిలే 
పాలపొంగు కోపాలు పైటచెంగు తాపాలు

గుమ్మడి పువ్వుల నవ్వులతో 
గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో 
ఇంద్రధనుసు విరిసే 
కలిసుంటే కలదు సుఖం 
కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం 
ప్రేమకు పేరంటం 

గుమ్మడి పువ్వుల నవ్వులతో 
గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో 
ఇంద్రధనుసు విరిసే 
వస్తారా మా ఇంటికి 
ప్రతిరోజూ సంక్రాంతికి 





చెలియా చెలియా చిరు కోపమా పాట లిరిక్స్ - Cheliya Cheliya Chirukopama Song Lyrics in Telugu - Kushi (2001) Telugu Songs Lyrics














చిత్రం : ఖుషి (2001)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : ఏ.ఎం.రత్నం 
గానం : శ్రీనివాస్, హరిణి 




చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము
కోపాలు తాపాలు మనకేల 
సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకేల 
ప్రేమంటే పదిలంగా వుండాలా
చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము

రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే 
గాలి తాకంగా పూచెనులే
ఐతే గాలే గెలిచిందననా 
లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా 
ఉలి తాకంగా వెలిసెనులే
ఐతే ఉలియే గెలిచిందననా 
లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా 
వ్యవహారం తీర్చేది ఎవరంటా
కళ్ళల్లో కదిలేటి కలలంటా 
ఊహల్లో ఊగేటి ఊసంటా

చెలియా చెలియా చిరు కోపమా

నీలి మేఘాలు చిరుగాలిని డీకొంటే 
మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవెననుకోమననా 
లేక నైజం అనుకోనా
మౌనరాగాలు రెండు కళ్ళని డీకొంటే 
ప్రేమ వాగల్లే పొంగునులే
దీన్ని ప్రళయం అనుకోమననా 
లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంటా 
వ్యవహారం తీర్చేది ఎవరంటా
అధరాలు చెప్పేటి కథలంటా 
హృదయంలో మెదిలేటి వలపంటా

చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము




నీటి నీటి సుక్కా నీలాల సుక్కా పాట లిరిక్స్ - Neeti Neeti Sukka Neelaala Sukka Song Lyrics in Telugu - Tuck Jagadish (2021) Telugu Songs Lyrics











చిత్రం : టక్ జగదీష్ (2021)

సంగీతం : ఎస్.ఎస్.థమన్  

సాహిత్యం : కళ్యాణ్ చక్రవర్తి

గానం : రంజని

 


నీటి నీటి సుక్కా నీలాల సుక్కా

నిలబాడి కురవాలి నీరెండయేలా

 

వరినారు గుత్తంగా గొంతెత్తి కూసే

పూటుగా పండితే పుటమేసి సేను

పెదకాపు ఇచ్చేను సరిపుట్ల ఒడ్లు

కొరకొంచి సూసేటి కొత్త అలివేలు

 

మాగాడి దున్నేటి మొనగాడు ఎవరే

గరిగోళ్ళ పిలగాడే ఘనమైన వాడే

 

కిట్టయ్య కనికట్టు ఓ గొల్లభామా

ఎగదన్ని నిలుసున్నా నిలువెత్తు కంకీ

నడుము వంచి వేసేటి నారు వల్లంకీ