13, అక్టోబర్ 2021, బుధవారం

ఆగవే నువ్వాగవే పోయే ఊపిరే నువ్వాపవే పాట లిరిక్స్ - Aagave Nuvvagave Poye Oopire Telugu Song Lyrics - Paagal (2021) Telugu Songs Lyrics


చిత్రం : పాగల్ (2021)

సాహిత్యం : కృష్ణ కాంత్ 

సంగీతం : రాధన్ 

గానం : సిద్ శ్రీరామ్ ఆగవే నువ్వాగవే పోయే ఊపిరే నువ్వాపవే 

ఆగవే నువ్వాగవే పోయే ఊపిరే నువ్వాపవే 


చెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్న 

ప్రతినిమిషం గురుతులనే మరవకనే బ్రతుకుతున్న 


కనులసలే నిదురోదిలే నీకొరకే వెతుకుతున్నా

వదిలేలుతు పరిగెడితే తెగిపోయే బంధమేనా 


తెగిపోయే బంధమేనా 

తెగిపోయే బంధమేనా 


అమ్మల్లే నుదురే తాకేటి చేయే 

మార్చేసి రాతే వేధించనే నన్నే 


ఎడారంటి ఎదకే ప్రాణాలు పోసే 

ప్రేమించమంటే గుండె కోసావులే 


ముగుస్తుంటే కథలన్నీ దాచాను బాధనే 

రెప్పల్లో నిలిపానే కన్నీటినే 


నాపైన చూపించావు ఎనలేని ప్రేమనే 

విరహాల నదిలో విసిరెయ్యకే 


హే నా వెనకనే నడిచావే 

నా బ్రతుకుని నడిపావే 

నా కలలని విడిచావే 

నేనుందే నీ కొరకే 

ఆ నింగిని చూపావే 

ఎగరడమే నేర్పావే

రెక్కలనే విరిచావే 


మన చెలిమే మరిచి 

చెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్న 

ప్రతినిమిషం గురుతులనే మరవకనే నే బ్రతుకుతున్న 


కనులసలే నిదురోదిలే నీకొరకే వెతుకుతున్నా

వదిలేలుతు పరిగెడితే తెగిపోయే బంధమేనా 


అద్దంలా ఎదురై చూపావు నన్నే 

వద్దంటూ రాయే విసిరావులే నాపై 


నువ్వేకాక ఎవరూ నాకంటు లేరే

నీ ధ్యాసలోనే నన్నే ముంచావులే 


నువ్ లేని క్షణమే నాకింక సూన్యమే 

నా వెంట లేనేలేదు సంతోషమే 

భరించానే ఇన్నాళ్లు తెలిసిన మోసమే 

నా కన్న నిన్నే బాగా నమ్మానులే 


హే ఓ నిజముని చెప్పేవా నన్నొదిలితే నువ్వైనా 

యే సుఖముగా ఉంటావా నీ వల్లే కాదసలే 


ఈ నడుమన దూరాలే చేరిపోకటిగా చేరాలే 

మన మునుపటి కాలాలే తెఅడుగే కదిపే 


చెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్న 

ప్రతినిమిషం గురుతులనే మరవకనే బ్రతుకుతున్న 


కనులసలే నిదురోదిలే నీకొరకే వెతుకుతున్నా

వదిలేలుతు పరిగెడితే తెగిపోయే బంధమేనా 


ఆగవే నువ్వాగవే పోయే ఊపిరే నువ్వాపవే 

ఆగవే నువ్వాగవే పోయే ఊపిరే నువ్వాపవే 


 

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Blogger Templates