12, జులై 2020, ఆదివారం

అరెరే మనసా ఇదంతా నిజమా పాట లిరిక్స్ - Arerey Manasa Song Lyrics in Telugu - Falaknuma Das (2019) Telugu Songs Lyrics




ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : ఫలక్ నుమా దాస్ (2019)
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
సంగీతం : వివేక్ సాగర్
గానం : సిద్ శ్రీరామ్

ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా
చూడకముందే వెనకే నడిచే
తోడొకటుంది కలిసా

తెలియదే అడగడం
ఎదురై నువ్వే దొరకడం
మాయనో ఏమిటో ఏమో

అరెరే మనసా...
ఇదంతా నిజమా...
ఇకపై మనమే...
సగము సగమా...

ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా

నా బ్రతుకున ఏ రోజో
ఏ పరిచయమవుతున్నా
నేనడిగినదే లేదే
కాదనుకుని పోతున్నా
ఇన్నాళ్ళుగ నా వెనకున్నది
నువ్వేనని తెలియదులే
నూరేళ్ళకు అమ్మగ మారిన
తోడే నువ్వే
ఆ' ఊరంతా మహరాజైనా
నీ ఒళ్ళో పడిపోయాక
దాసుడనైపోయానే...

అరెరే మనసా...
ఇదంతా నిజమా...
ఇకపై మనమే...
సగము సగమా...

నేనడిగిన రాగాలు
నీ ప్రణయపు మౌనాలు
నీ కురుల సమీరాలు
నే వెతికిన తీరాలు
ఇన్నాళ్ళుగ నా ఉదయానికి
ఎదురైనది శూన్యములే
తొలిసారిగ నీ ముఖమన్నది
నా వేకువలే
ఆ' ప్రాణాలే అరచేతుల్లో
పెట్టిస్తూ నా ఊపిరితో
సంతకమే చేస్తున్నా

అరెరే మనసా...
ఇదంతా నిజమా...
ఇకపై మనమే...
సగము సగమా...

అరెరే మనసా
(అరెరే మనసా)
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా

అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి