చిత్రం : రాజ రాజ చోర (2021)
సాహిత్యం : కృష్ణ కాంత్
సంగీతం : వివేక్ సాగర్
గానం : సిద్ శ్రీరామ్
సందేల గూడులేని పావురానికి
నీడ దొరికెను ఇవాళే
అందనున్న ఏలలోన సొంతరెక్కలే
సాయమివ్వనన్న సవాలే
నున్నగున్న దూరాలే మందలించే తీరాలే
నిజం ఇదే కదా
కలే విడి పదా
ఓ .. నకలు రాతలా నకలు రాతలా
నలిగి పోకుమా మిగిలి పోకుమా
అసలు మాటవై అసలువే నువ్వై
మరల రాయుమా మరల రాయుమా
నీ ప్రక్షాళన స్వీయమే
ఈ లోకానికే సేవలే
కన్నా ఇది మరచిపోతే మనలేవులే
నడి ఎడారిలో నడిచే దారిలో
చినుకు రాలేనా వెలుగు వాలేనా
నలుపు వీడుతూ మలుపు కోరుతూ
ఒక ప్రయాణమా ఇది ప్రయాణమా
తెలిసి తప్పులే తనవి తప్పులే
విడిచి దిక్కులే వెతికి చిక్కులే
వదిలి రెక్కలే గతపు రెక్కలే
ఒక తపస్సిదే ఒక తపస్సిదే
పొరబాటుని సరిచేయాగా
అనుమోదనే ఇక దారిరా
నినుకాదని వదిలేసినా
అభిమానమే దరిచేరులే
ఇక చీకటే వెలివేయగా
మన మారుపే తొలివేకువే
తరిమేయర కరి చీకటే
అయినా సరే నువు లోకువే
తరిమేయర కరి చీకటే
అయినా సరే నువు లోకువే
చిరుగాలికే చేరలేదులే
చెర చేరినా పడిపోదులే
చిరుగాలికే చేరలేదులే
చెర చేరినా పడిపోదులే
నిజం ఇదే కదా
కలే విడి పదా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి