25, అక్టోబర్ 2021, సోమవారం

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ పాట లిరిక్స్ - Varsham Mundhugaa Mabbula Gharshana Telugu Song Lyrics - Sega (2011) Telugu Songs Lyrics









చిత్రం : సెగ (2011)

సంగీతం : జాషువా శ్రీధర్

సాహిత్యం : శ్రీమణి

గానం : సుజాన్నె, సునీత


 

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ 

మనసును ముసిరెనే

ఇది మరి ప్రణయమా ప్రళయమా

హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ

నన్నే మరిచెనే ఇది బాధో ఏదో 

 

కునుకేమొ దరికి రాదు వణుకేమొ వదిలిపోదు

ఈ వింత పరుగు నాతోన పయనం మాత్రం పూర్తవదు

నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు

నువు దూరం ఐపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం

 

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ 

మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా

హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ

నన్నే మరిచెనే ఇది బాధో ఏదో

 

పసి వయసులొ నాటిన విత్తులు ఓ...

మనకన్నాపెరిగెను ఎత్తులు ఓ...

విరబూసెను పువ్వులు ఇప్పుడు ఓ...

కోసిందెవరప్పటికప్పుడు ఓ...

నువ్వు తోడై ఉన్ననాడు పలకరించే దారులన్నీ

దారులు తప్పుతున్నావే

 

నా కన్నులు కలలకు కొలనులు ఓ...

కన్నీళ్ళతొ జారెను ఎందుకు ఓ....

నా సంధ్యలు చల్లని గాలులు ఓ...

సుడిగాలిగ మారెను ఎందుకు ఓ...

ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగా మారేనే 

ఈ చిత్రవధ నీకు ఉండదా

 

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ

మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా

హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ

నన్నే మరిచెనే ఇది బాధో ఏదో

 

కునుకేమొ దరికి రాదు వణుకేమొ వదిలిపోదు

ఈ వింత పరుగు నాతోన పయనం మాత్రం పూర్తవదు

నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు

నువు దూరం ఐపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం

 

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ 

మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా

హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ

నన్నే మరిచెనే ఇది బాధో ఏదో

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి