11, అక్టోబర్ 2021, సోమవారం

కథలు కథలుగా కలలు కలలు మిగిలేనా పాట లిరిక్స్ - Kathalu Kathaluga Kalalu Migilena Telugu Song Lyrics - Kondapolam (2021) Telugu Songs Lyrics







చిత్రం : కొండపొలం (2021)

సాహిత్యం : ఎం.ఎం.కీరవాణి 

సంగీతం : ఎం.ఎం.కీరవాణి 

గానం : కైలాష్ ఖేర్, యామిని ఘంటసాల 



కథలు కథలుగా కలలు కలలు మిగిలేనా

కథలు కథలుగా కలలు కలలు మిగిలేనా 


తుదలు లేని ఆ కథల గతులు అడవేనా 

కాదని చెప్పవే కారణం అడగకే మనసా 

ఆశనే భిక్షగా అడిగా ఇవ్వవే 


కథలు కథలుగా కలలు కలలు మిగిలేనా 

తుదలు లేని ఆ కథల గతులు ఆడవేనా 


పరిచయం అయినా గాలి నా ఊపిరే చెలిస్తే 

తన వశం అయినా ప్రాణం తనువంతా దహిస్తే 

తెగ ఎదురుచూసి తడిసింది కంటిపాపే 

సెగ రగులుతున్న యద కొరే ఊరడింపే 


కథలు కథలుగా కలలు కలలు మిగిలేనా 

చితికి చితికి ఆ కథల బతుకు చితికేనా 


అడిగితే నిన్ను నువ్వే నా దారే ఏటంటూ 

బదులుగా నీకు నువ్వే చెబుతావో రహస్యం 

ఏ ధూళిలోన కలిసిందో నీ ప్రపంచం 

ఆ అణువు అణువు వెతకాలి నీ వికాసం 


చేరని గమ్యమే చేరువై ఓ క్షణం 

చెప్పదా ఈ నిజం ఓ నమ్మడం జీవితం 

నమ్మడం జీవితం నిను నువ్వే 

నమ్మడం జీవితం నమ్మడం జీవితం 

నిను నువ్వే నమ్మడం జీవితం 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి