26, అక్టోబర్ 2021, మంగళవారం

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష పాట లిరిక్స్ - Nuvve Naa Swasa Manasuna Neekai Abhilaasha Telugu Song Lyrics - Okariki Okaru (2003) Telugu Songs Lyrics










చిత్రం : ఒకరికి ఒకరు (2003)

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

సాహిత్యం : చంద్రబోస్ 

గానం : శ్రేయా ఘోషల్


 

నువ్వే నా శ్వాస

మనసున నీకై అభిలాష

బ్రతుకైన నీతోనే

చితికైన నీతోనే

వెతికేది నే నిన్నేనని

చెప్పాలని చిన్ని ఆశ

ఓ ప్రియతమా...

ఓ ప్రియతమా...!

 

నువ్వే నా శ్వాస

మనసున నీకై అభిలాష

 

పూవుల్లో పరిమళాన్ని

పరిచయమే చేశావు

తారల్లో మెరుపులన్ని

దోసిలిలో నింపావు

మబ్బుల్లో చినుకులన్ని

మనసులోన కురిపించావు

నవ్వుల్లో నవలోకాన్ని

నా ముందే నిలిపినావుగా

నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా

నే మరువలేనని

నీతో చెప్పాలని చిన్ని ఆశ

ఓ ప్రియతమా...

ఓ ప్రియతమా!

 

నువ్వే నా శ్వాస

మనసున నీకై అభిలాష

 

సూర్యునితో పంపుతున్నా

అనురాగపు కిరణాన్ని

గాలులతో పంపుతున్నా

ఆరాధన రాగాన్ని

ఏరులతో పంపుతున్నా

ఆరాటపు ప్రవాహాన్ని

దారులతో పంపిస్తున్నా

అలుపెరుగని హృదయ లయలని

ఏ చోట నువ్వున్నా

నీ కొరకు చూస్తున్నా

నా ప్రేమ సందేశం విని

వస్తావని చిన్ని ఆశ

ఓ ప్రియతమా...

ఓ ప్రియతమా!

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి