18, అక్టోబర్ 2021, సోమవారం

కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో పాట లిరిక్స్ - Kalise Prathi Sandhyalo Kalige Pulakinthalo Telugu Song Lyrics - Aalapana (1986) Telugu Songs Lyrics








చిత్రం : ఆలాపన (1986)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : సి.నారాయణ రెడ్డి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి


 

కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో

కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో

నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి

నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి

కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో..

 

పొంగిపోదా సాగరాత్మ నింగికి.. ఆఆ.ఆ..

చేరుకోదా చంద్ర హృదయం నీటికి.. ఆఆ.ఆ..

పొంగిపోదా సాగరాత్మ నింగికి.. ఆఆ.ఆ..

చేరుకోదా చంద్ర హృదయం నీటికి.. ఆఆ.ఆ..

సృష్టిలోన ఉంది ఈ బంధమే

అల్లుకుంది అంతటా అందమే

తొణికే బిడియం తొలగాలి

ఒణికే అధరం పిలవాలి

ఆ..ఆ...ఆ...

 

కలిసే ప్రతి సంధ్యలో...

పలికే ప్రతి అందెలో

 

మేనితోనే ఆగుతాయి ముద్రలు.. ఆఆ.ఆ..

గుండె దాకా సాగుతాయి ముద్దులు.. ఆఆ.ఆ..

మేనితోనే ఆగుతాయి ముద్రలు.. ఆఆ.ఆ..

గుండె దాకా సాగుతాయి ముద్దులు.. ఆఆ.ఆ..

ఇంత తీపి కొంతగా పంచుకో

వెన్నెలంత కళ్ళలో నింపుకో

బ్రతుకే జతగా పారాలి

పరువం తీరం చేరాలి

ఆ...ఆ...ఆ...ఆ

 

కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో

కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో

నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి

నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి

కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి