20, అక్టోబర్ 2021, బుధవారం

దిగు దిగు దిగు నాగ పాట లిరిక్స్ - Digu Digu Digu Naaga Song Lyrics in Telugu - Varudu Kavalenu (2021) Telugu Songs Lyrics








చిత్రం : వరుడు కావలెను (2021)

సాహిత్యం : అనంత శ్రీరామ్ 

సంగీతం : విశాల్ చంద్రశేఖర్ 

గానం : శ్రేయా ఘోషల్ 



దిగు దిగు దిగు నాగ 

నాగో నా దివ్యసుందర నాగో నాగ 

దిగు దిగు దిగు నాగ 

నాగో నా దివ్యసుందర నాగో నాగ 


నాగేటి సాలకాడ నాకేటి పనిరో

నాపగడ్డి  సేలకాడ నాకేటి పనిరో

నాగేటి సాలకాడ నాకేటి పనిరో

నాపగడ్డి సేలకాడ నాకేటి పనిరో


సందాల సంతకాడా నాకేటి పనిరో 

సాకిరేవు తగువుకాడ నాకెట్టి పనిరో 


ఇరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి

ఎలగబెట్టిన నీ యవ్వారం చాలురో 


కొంపకొచ్చిపోరోయ్ కోడెనాగ 

కొంపముంచుతాందోయ్ ఈడు బాగా 

కొంపకొచ్చిపోరోయ్ కోడెనాగ 

కొంపముంచుతాందోయ్ ఈడు బాగా 


సెంపగిల్లిపోరోయ్ సెట్టినాగ  

సంపుతాంది పైటే పడగలాగ  


దిగు దిగు దిగు నాగ 

నాగో నా దివ్యసుందర నాగో నాగ 

దిగు దిగు దిగు నాగ 

నాగో నా దివ్యసుందర నాగో నాగ 


ఊరిమీది గొడవలన్ని నెత్తిమీదికెత్తుకుంటవ్ 

గొడుగుతోటి పోయేదాన్ని గుడిసేదాకా తెచ్చుకుంటవ్ 

ఊరిమీది గొడవలన్ని నెత్తిమీదికెత్తుకుంటవ్ 

గొడుగుతోటి పోయేదాన్ని గుడిసేదాకా తెచ్చుకుంటవ్ 



అలకతోని ఇల్లు అలికేత్తెనే గాని ఈ దిక్కు సూడవ్ 

పైసాకి పనికిరాని కానికి కలిసిరాని 

కన్నెమోజు తీర్చలేని సున్నాలు సాలురో  


కొంపకొచ్చిపోరోయ్ కోడెనాగ

కొంపముంచుతాందోయ్ ఈడు బాగా 

గంపాదించిరారోయ్ గండు నాగ 

గంపెడాశ నాలో రంపమేగ



దిగు దిగు దిగు నాగ 

నాగో నా దివ్యసుందర నాగో నాగ 

దిగు దిగు దిగు నాగ 

నాగో నా దివ్యసుందర నాగో నాగ 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి