26, అక్టోబర్ 2021, మంగళవారం

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా పాట లిరిక్స్ - Oke Oka Maata Madhilona Daagundi Mounamgaa Telugu Song Lyrics - Chakram (2005) Telugu Songs Lyrics









చిత్రం : చక్రం (2005)

సంగీతం : చక్రి

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : చక్రి


 

ఒకే ఒక మాట

మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాట

పెదవోపలేనంత తీయంగా

నా పేరు నీ ప్రేమనీ

నా దారి నీ వలపనీ

నా చూపు నీ నవ్వనీ

నా ఊపిరే నువ్వనీ

నీకు చెప్పాలనీ..

 

ఒకే ఒక మాట

మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాట

పెదవోపలేనంత తీయంగా 

 

ఆఆఆఅ...ఓఓఓఓఓఓ...

ఆఆఆఅ...ఓఓఓఓఓఓ...

 

 

నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు

నమ్మననీ నవ్వుకొని చాల్లే పోమ్మంటావు

నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ

నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ

నీ కంటిమైమరుపులో నను పొల్చుకుంటాననీ

తల ఆన్చి నీగుండెపై నా పేరు వింటాననీ

నీకు చెప్పాలని 

 

ఒకే ఒక మాట

మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాట

పెదవోపలేనంత తీయంగా  

 

ఒహ్హో..ఓఓ... ఒహ్హ్హోఓఓఓఓ

ఒహ్హో..ఓఓ... ఒహ్హ్హోఓఓఓఓ

 

 నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం

నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం

నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదనీ

నిను కలుసుకున్న ఆక్షణం నను వొదిలిపోదనీ

ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ

ఈ మహిమ నేదేననీ నీకైనా తెలుసా అనీ

నీకు చెప్పాలని 

 

ఒకే ఒక మాట

మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాట

పెదవోపలేనంత తీయంగా  

 

నా పేరు నీ ప్రేమనీ

నా దారి నీ వలపనీ

నా చూపు నీ నవ్వనీ

నా ఊపిరే నువ్వనీ

నీకు చెప్పాలనీ..

 

ఒకే ఒక మాట

మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాట

పెదవోపలేనంత తీయంగా 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి