16, అక్టోబర్ 2021, శనివారం

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన పాట లిరిక్స్ - Jilibili Palukula Chilipiga Palikina Telugu Song Lyrics - Sithara (1983) Telugu Songs Lyrics







చిత్రం :  సితార (1983)

సంగీతం :  ఇళయరాజా

సాహిత్యం :  వేటూరి సుందరరామమూర్తి

గానం :  యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి

 

 

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా

కిలకిల నగవుల వలపులు చిలికిన.. ఓ మైనా మైనా

మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార

మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార

మధువుల పెదవుల మమతలు విరిసిన.. ఓ మైనా ఓ మైనా

కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా.. ఓ మైనా

 

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా

కిలకిల నగవుల వలపులు చిలికిన.. ఓ మైనా మైనా

 

అడగనులే చిరునామా.. ఓ మైనా ఓ మైనా

చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా

తారలకే సిగపువ్వా...  తారాడే సిరిమువ్వా

తారలకే సిగపువ్వా... తారాడే సిరిమువ్వా

హరివిల్లు రంగుల్లో వర్ణాలే

చిలికిన చిలకవు ఉలకవు పలకవు.. ఓ మైనా ఏమైనా

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన... ఓ మైనా మైనా

 

ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా

మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా

ఎండలకే అల్లాడే...  వెన్నెలలో క్రీనీడ

ఎండలకే అల్లాడే...  వెన్నెలలో క్రీనీడ

వినువీధి వీణల్లో రాగంలా

ఆశల ముంగిట ఊహల ముగ్గులు.. నిలిపేన ఏమైనా

 

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా

తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా

మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార

గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం

మధువుల పెదవుల మమతలు విరిసిన... ఓ మైనా ఓ మైనా

చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా

 

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి