30, అక్టోబర్ 2021, శనివారం

ఓ పాపా లాలి జన్మకే లాలి పాట లిరిక్స్ - Oo Paapa Laali Janmake Laali Telugu Song Lyrics - Geethanjali (1989) Telugu Songs Lyrics









చిత్రం : గీతాంజలి (1989)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


 

ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా తీయగా

ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా

ఓ పాపా లాలి

 

నా జోలలా లీలగా తాకాలని 

గాలినే కోరనా జాలిగా

నీ సవ్వడే సన్నగా ఉండాలని 

కోరనా గుండెనే కోరిక

కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో

తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో

ఇరు చేపల కనుపాపలకిది నా మనవీ

 

ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా తీయగా

ఓ పాపా లాలి

 

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి 

గాలిలో తేలిపో వెళ్ళిపో

ఓ కోయిలా పాడవే నా పాటని 

తీయనీ తేనెలే చల్లిపో

ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో

సెలయేరుల అల పాటే వినిపించని గదిలో

చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ

 

ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా తీయగా

ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా

ఓ పాపా లాలి

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి