9, అక్టోబర్ 2021, శనివారం

మనసుతో చూడలేని మార్గమే లేదురా పాట లిరిక్స్ - Manasutho Choodaleni Maargame Ledhura Telugu Song Lyrics - Clap (2021) Telugu Songs Lyrics






చిత్రం : క్లాప్ (2021)

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 

సంగీతం : ఇళయరాజా 

గానం : ఇళయరాజా



మనసుతో చూడలేని మార్గమే లేదురా

కలలు ఉప్పొంగిపోని కన్ను నిరుపేదరా 

నిండుగా నీదిరా హో జీవితం ఆకసం 

నిప్పులా ఎదుగుతూ చేసుకో కైవసం 


నీ విలువేదని అంటే నీలో ఆలోచనే 

నీ గెలుపెంతని అంటే నీలోని సాధనే 

మనసుతో చూడలేని మార్గమే లేదురా 

కలలు ఉప్పొంగిపోని కన్ను నిరుపేదరా 


ఉలి నువ్వే శిలవు నువ్వే నిను నువ్వే మలచుకోరా 

బలమైన ఆశయాన్ని బతుకంతా పరుచుకోరా

కాలు మోపవని దారులు పూలు మొలిచేనా

సులువుగా నడక సాగేనా 


ఏ శ్రమా లేని తీపి చేదుగా తోచదా 

తలచుకుంటే నీ కథైనా చరితగా మారదా    


మనసుతో చూడలేని మార్గమే లేదురా 

కలలు ఉప్పొంగిపోని కన్ను నిరుపేదరా 


పడకుండా ఒక్కసారి నడిచావా చిన్ననాడు 

వెన్నంటి రారు ఎవరు అనునిత్యం నీకు తోడు 

ఓటమౌతావనో నలుగురు నవ్విపోతారనో 

భయపడి ఆగిపోతావా 


తెగువగా నింగి దూకే చినుకు ఎదలో తడి 

కలతనొదిలి నదిగ కదిలి కలల పరుగైనది 


మనసుతో చూడలేని మార్గమే లేదురా 

కలలు ఉప్పొంగిపోని కన్ను నిరుపేదరా

నిండుగా నీదిరా హో జీవితం ఆకసం 

నిప్పులా ఎదుగుతూ చేసుకో కైవసం 


నీ విలువేదని అంటే నీలో ఆలోచనే 

నీ గెలుపెంతని అంటే నీలోని సాధనే 


మనసుతో చూడలేని మార్గమే లేదురా 

కలలు ఉప్పొంగిపోని కన్ను నిరుపేదరా



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి