చిత్రం : ఆమె (2019)
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : మార్టి భరత్
గానం : గౌతమ్ భరద్వాజ్
జననం మరణం నిజమైనవి అవి యేరా
ఆలాపము అంటూ ఆలోచన చెయ్యకురా
చూడనిదాన్ని అవహేళన చెయ్యొద్దు
జ్ఞానానంత బూడిదలో పొయ్యొద్దు భాయి
లేదు లేదు లేదు లేదు
మీ చేతుల్లో ఏమి లేదు
లేదు లేదు లేదు లేదు
మీ చేతుల్లో ఏమి లేదు
ఆడించే వాడన్నట్టే ఆడాలి అందరం
మీనం మేషం వద్దు
మన కలలే మనకు ముద్దు
బెరుకు భయము వద్దు
అభిమానం ఉంటే చాలోయి
మనని మనిషిగా మార్చునోయి
కలిమి బలిమి కాదురా సత్యం
కలలే కనడం మానవ నైజం
ప్రాణమనిత్యం దేహమనిత్యం
శోకమనిత్యం సౌఖ్యమనిత్యం
నీ అదృష్టం బాగుందంటే
చీకటి వేకుగై వచ్చెనంటే
రోజులు మారే కాలం లోన
సత్యమేదని అడిగావంటే
తప్పు లేదు తప్పు లేదు
ఇక్కడేమి తప్పుకాదు
తప్పు లేదు తప్పు లేదు
ఇక్కడేది తప్పుకాదు
ఆడించే వాడన్నట్టే ఆడాలి అందరం
మీనం మేషం వద్దు
మన కలలే మనకు ముద్దు
బెరుకు భయము వద్దు
అభిమానం ఉంటే చాలోయి
మనని మనిషిగా మార్చునోయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి