20, అక్టోబర్ 2021, బుధవారం

ఊరు ఏరయ్యిందీ ఏరు హోరెత్తింది పాట లిరిక్స్ - Oooru Erayyindi Yeru Horetthindhi Telugu Song Lyrics - Kanche (2015) Telugu Songs Lyrics








చిత్రం : కంచె (2015)

సంగీతం : చిరంతన్ భట్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : శంకర్ మహదేవన్, బృందం

 

ఊరు ఏరయ్యిందీ ఏరు హోరెత్తింది

ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది

ఊరు ఏరయ్యిందీ ఏరు హోరెత్తింది

ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది

భేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు

హోరెత్తే కోలాహాలంలో..ఓఓ..

 

ఏడేడు లోకాలు ఏలేటి మారేడా

ఊరేగి రావయ్యా మా వాడకీవేళా

పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోళ్ళే అవ్వాలా

కానోళ్ళనే మాట లేకుండా పోవాల

 

తోబుట్టువింటికి సారేట్టుకెళ్ళి

సాకేట్టుకోచ్చావ మా గడపకీ

మాలచ్చి మగడ ఏమిచ్చి పంపాల

మీరిచ్చిందేగా మాకున్నదీ

 

కదిలేటి రథచక్రమేమన్నదంట

కొడవళ్ళు నాగళ్ళు చేసే పనంతా భూదేవి పూజే కదా

ఏ వేదమైన ఏ వరి సేదమయిన ఆ స్వామి సేవే కదా

కడుపార ఈ మన్ను కన్నోళ్ళె అంతా కులమొచ్చి కాదంటదా

ప్రతి ఇంటి పెళ్ళంటిదీ వేడుకా జనమంతా చుట్టాలే కదా

 

ఏడేడు లోకాలు ఏలేటి మారేడా

ఊరేగి రావయ్యా మా వాడకీవేళా

పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోళ్ళే అవ్వాలా

కానోళ్ళనే మాట లేకుండా పోవాల

 

వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాల తారంగవాడే ఈ కేరింతల్లోన

ఈపంచకాపంచకే కంచెలున్నా జరపాల ఈ జాతర

వెయ్యామడలు దాటి సయ్యాటలియ్యాల మా చెలిమి చాటించగా

ప్రతి పల్లె ఈ సంబరం సాక్షిగా మనలాగే ఉండాలనుకోదా

 

ఏడేడు లోకాలు ఏలేటి మారేడా

ఊరేగి రావయ్యా మా వాడకీవేళా

పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోళ్ళే అవ్వాలా

కానోళ్ళనే మాట లేకుండా పోవాల


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి